Vangaveeti Radha: ఏపీ ఎన్నికల్లో వైనాట్ 175 లక్ష్యంతో వైఎస్ జగన్ భారీగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. గెలుపు గుర్రాలే ప్రాతిపదికగా అభ్యర్ధుల ఎంపిక ఆచితూచి చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలకనేతలపై దృష్టి సారించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో భారీగా మార్పులు చేర్పులు చేస్తున్న వైఎస్ జగన్ ఇప్పటికే మూడు జాబితాలు ప్రకటించారు. తెలుగుదేశం-జనసేన పొత్తు నేపధ్యంలో సామాజిక సమీకరణాల్ని పరిగణలో తీసుకుని గెలుపు గుర్రాల్ని సిద్ధం చేస్తున్నారు. వైఎస్ జగన్ వ్యూహాలు ప్రతిపక్షాలకు అంతుబట్టడం లేదు. విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం ఊహించని పరిణామం. ఇప్పుడు మరో కీలకనేత కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.


కాపు సామాజికవర్గంలో చీలిక కోసం వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆ సామాజికవర్గంలో కీలకనేతగా ఉన్న వంగవీటి రాథాను పార్టీలో రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతని సన్నిహితులు వైసీపీ పార్టీ నేతలైనే కొడాలి నాని, వల్లభనేని వంశీలదే ఆ బాధ్యత. ఒకవేళ వంగవీటి రాధా పార్టీలో చేరితే అతని కోసం మచిలీపట్నం లోక్‌సభ స్థానం సిద్ధం చేసి పెట్టారు. విజయవాడ ఇప్పటికే కమ్మ సామాజికవర్గానికి ఇచ్చినందున మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలో బలమైన కాపు సామాజికవర్గానికి ఇవ్వాలనేది జగన్ ఆలోచన. అందుకే వంగవీటి రాధా కోసం చూస్తున్నారు. వంగవీటి రాధా మచిలీపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం గుడివాడ, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలపై ఉంటుందని అంచనా. 


వంగవీటి రాధా జనసేనలో వెళ్లాలని అనుకున్నా..ఆయన కోరుకుంటున్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం దక్కే పరిస్థితి లేదు. ఎందుకంటే జనసేన-టీడీపీ పొత్తులో భాగంగా ఆ స్థానం కచ్చితంగా తెలుగుదేశం అభ్యర్ధిగా బొండా ఉమామహేశ్వరరావుకే దక్కుతుంది. అందుకే ఆ స్థానం దక్కనప్పుడు జనసేనలో చేరినా ప్రయోజనం ఉండకపోవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని ఇప్పటికే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కేటాయించింది. అందుకే వైసీపీలో వంగవీటి రాధా చేరితే మచిలీపట్నం లోక్‌సభ కేటాయించే పరిస్థితి కన్పిస్తోంది. మరి వంగవీటి రాధా ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా తెలియదు.


Also read: Senior Citizen Schemes: సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వర్సెస్ సీనియర్ సిటిజన్ ఎఫ్‌డిల్లో ఏది మంచిది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook