Varanasi Ganga Pushkaralu 2023: గంగా పుష్కరాలకని వారణాసికి వచ్చే తెలుగు వారి కోసం జీవీఎల్ ప్రత్యేక ఏర్పాట్లు
Varanasi Ganga Pushkaralu 2023 Dates: తెలుగు వారికి వారణాసిలో గల సదుపాయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి తెలుగువారి జీవితకాల ఆకాంక్ష అయిన గంగా పుష్కరాలు, వారణాసి విశ్వనాథుని దర్శనం ఏర్పాట్లు సజావుగా జరిగేందుకు కాశీ తెలుగు సమితి అధ్యక్షులు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున గంగా పుష్కరాల సమన్వయకర్త గా వ్యవహరిస్తున్న జీవీఎల్ నరసింహా రావు కాశీలో తెలుగు వారి కోసం చేస్తోన్న ఏర్పాట్లను పరిశీలించారు.
Varanasi Ganga Pushkaralu 2023 Dates: గంగా పుష్కరాల సందర్భంగా తొలి రోజు బిజెపి ఎంపీ రాజ్యసభ సభ్యులు, కాశీ తెలుగు సమితి అధ్యక్షులు, గంగా పుష్కర కమిటీ నిర్వాహకులు జీవీఎల్ నరసింహా రావు గంగా పుష్కరాల మొదటి రోజున వారణాసిలోని వివిధ ఘాట్లను సందర్శించి పుష్కర సందర్భంగా అక్కడ యాత్రికుల సౌకర్యార్థమై స్థానిక అధికారులు కాశీ తెలుగు సమితి నిర్వాహకులు ఏర్పాటుచేసిన సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్బంగా స్థానిక ఉన్నతాధికారులతో కలిసి వారణాసిలోగల వివిధ గంగా ఘాట్లను సందర్శించి పుష్కర యాత్రికుల సౌకర్యార్థం అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
కాశీ తెలుగు సమితి అధ్యక్షునిగాను, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున గంగా పుష్కరాల సమన్వయకర్త గాను వ్యవహరిస్తున్న జీవీఎల్ నరసింహా రావు.. తెలుగు వారికి వారణాసిలో గల సదుపాయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి తెలుగువారి జీవితకాల ఆకాంక్ష అయిన గంగా పుష్కరాలు, వారణాసి విశ్వనాథుని దర్శనం ఏర్పాట్లు సజావుగా జరిగేందుకు గత కొంతకాలంగా శ్రమిస్తూ తెలుగు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వారణాసికి నేరుగా రైళ్ళను ఏర్పాటు చేయించడమేకాక, వారణాసిలోని వివిధ తెలుగు సంఘాలు, మఠాల వారితో మాట్లాడి వారణాసిని సందర్శించే తెలుగు యాత్రికుల భోజన, నివాస వసతులకై తగిన ఏర్పాట్లను చేయించడం అందరికీ తెలిసిందే.
ఇదేకాక 29వ తారీఖున జీవీఎల్ అభ్యర్థన మేరకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు గంగా పుష్కర యాత్రికులను ఉద్దేశించి ప్రసంగం చేయనున్నారని, వారి నియోజకవర్గమైన వారణాసిలో జరుగుతున్న అత్యంత పవిత్రమైన గంగా నది పుష్కరాల సందర్భంగా కాశీ తెలుగు సంగమం సభలో తెలుగు యాత్రీకులను, గంగా పుష్కర యాత్రికులను ఉద్దేశించి వారు ప్రత్యేక శ్రద్ధ వహించి మాట్లాడడానికి అంగీకరించినందుకు జీవీఎల్ ప్రధానికి ధన్యవాదాలు తెలియజేశారు.
[[{"fid":"270439","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"varanasi-ganga-pushkaralu-2023-dates-kashi-telugu-samithi-ganga-pushkara-committee-organizer-bjp-mp-gvl-narasimha-rao.jpg","field_file_image_title_text[und][0][value]":"Varanasi Ganga Pushkaralu 2023: గంగా పుష్కరాలకని వారణాసికి వచ్చే తెలుగు వారి కోసం జీవీఎల్ ప్రత్యేక ఏర్పాట్లు"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"varanasi-ganga-pushkaralu-2023-dates-kashi-telugu-samithi-ganga-pushkara-committee-organizer-bjp-mp-gvl-narasimha-rao.jpg","field_file_image_title_text[und][0][value]":"Varanasi Ganga Pushkaralu 2023: గంగా పుష్కరాలకని వారణాసికి వచ్చే తెలుగు వారి కోసం జీవీఎల్ ప్రత్యేక ఏర్పాట్లు"}},"link_text":false,"attributes":{"alt":"varanasi-ganga-pushkaralu-2023-dates-kashi-telugu-samithi-ganga-pushkara-committee-organizer-bjp-mp-gvl-narasimha-rao.jpg","title":"Varanasi Ganga Pushkaralu 2023: గంగా పుష్కరాలకని వారణాసికి వచ్చే తెలుగు వారి కోసం జీవీఎల్ ప్రత్యేక ఏర్పాట్లు","class":"media-element file-default","data-delta":"1"}}]]
ఇది కూడా చదవండి : YS Vivekananda Reddy Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి అల్లుడిని ప్రశ్నించిన సీబీఐ
ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారిని ఉద్దేశించి జీవీఎల్ మాట్లాడుతూ.. " ఈసారి గంగా పుష్కరాలకు రావాలనుకున్న తెలుగు యాత్రికులు ఎటువంటి సంకోచం లేకుండా వారణాసి సందర్శించవచ్చనీ, తాము ప్రత్యేకంగా తెలుగువారి సౌకర్యార్థం ముద్రించిన కరపత్రంలో యాత్రీకుల భోజన వసతి, నివాస సదుపాయాలు వంటి సౌకర్యాల వివరాలను పొందుపరిచామని దాని ద్వారా వారణాసిలో ఏ ప్రదేశానికైనా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేరుకోవచ్చు" అని తెలియజేశారు. పుష్కరాల మొదటి రోజయిన శనివారం జీవీఎల్ నరసింహా రావు శాస్త్రోక్తంగా వారణాసిలో రాజా ఘాట్ నందు గంగా నదికి పూజలు నిర్వహించి పుష్కరుడికి ఆహ్వానం పలికే ఘట్టంలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK