Minor girls fight for boyfriend: చుట్టూ విద్యార్థుల గుంపు... మధ్యలో ఇద్దరు బాలికలు... జుట్టు జట్టు పట్టుకుని కసితీరా కొట్టుకున్నారు... ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు... అక్కడే ఉన్న కొంతమంది అబ్బాయిలు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడిపించారు... లేదంటే ఆ ఫైటింగ్ సీన్ ఇంకెంత సేపు ఉండేదో... ఇంతకీ ఆ ఇద్దరు బాలికలు అందరి ముందు అలా ఫైట్ చేసింది దేనికోసమంటే... 'బాయ్‌ఫ్రెండ్' కోసం. విశాఖ (Vishakapatnam) జిల్లా అనకాపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ ఇద్దరు బాలికలు ఒకే అబ్బాయిని ఇష్టపడినట్లు తెలుస్తోంది. అతను నావాడంటే నావాడని ఇద్దరు పేచీకి దిగినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అందరూ చూస్తుండగా ఇద్దరు పిడిగుద్దులు కురిపించుకుంటూ పోట్లాటకు దిగారు. అనకాపల్లిలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న అబ్బాయిలు అడ్డుకోబట్టి సరిపోయింది కానీ లేదంటే మరింత రచ్చ జరిగి ఉండేది. 


ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇద్దరు బాలికలతో పాటు, వారి బాయ్‌ఫ్రెండ్‌ను (Boyfriend) పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలాంటి గొడవలకు దిగవద్దని మందలించినట్లు సమాచారం. స్థానికులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుకోవాల్సిన వయసులో ఇలా బాయ్‌ఫ్రెండ్ కోసం యుద్ధాలకు దిగడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.



Also Read: Scrub Typhus: హైదరాబాద్‌లో స్క్రబ్ టైఫస్ కలకలం-టెన్షన్ పెట్టిస్తోన్న మరో వ్యాధి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook