Vijaya Sai  Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి ఇటీవల పార్టీకు, ఎంపీ పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఏ పార్టీలో చేరనని, రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అన్నట్టుగానే వ్యవసాయంలో దిగిపోయారు. ఆ ఫోటోలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజ్యసభ ఎంపీగా పదవీకాలం ఇంకా మూడేళ్లున్నప్పటికీ అటు పదవికి ఇటు పార్టీకు రాజీనామా చేసి విజయ సాయి రెడ్డి సంచలనం రేపారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరనని, అసలు రాజకీయాల్లోనే ఉండనని స్పష్టం చేశారు. పార్టీ అధినేత జగన్‌తో చర్చించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు.ఇక తాను వ్యవసాయం చేసుకుంటానని తెలిపారు. చెప్పినట్టుగానే హార్టికల్చర్ ప్రారంభించేశారు. ఈ మేరకు టీ షర్ట్‌‌ ఓపెన్ టాప్ జీప్‌లో వ్యవసాయ క్షేత్రంలో తిరుగుతున్న ఫోటోలు షేర్ చేశారు. ఉద్యానవన పంటలు ప్రారంభించానని కోట్ చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.



ఏదో మాట వరుసకు అన్సారులే తిరిగి రాజకీయాల్లో వచ్చేస్తారని భావించినవారికి షాక్ ఇచ్చారు. చెప్పినట్టే హార్టికల్చర్ మొదలెట్టినట్టు ప్రకటించారు. విజయ సాయి రెడ్డి చేపట్టిన కొత్త మార్గం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. 


Also read: Nara Lokesh: ఏపీ డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్ పేరు ఖరారైనట్టేనా, లోకేశ్ మాటల అర్ధమేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి