స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ తన ఇంటిపై జాతీయా జెండాను ఎగురవేయడం పట్ల రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఇంటిపైకప్పుపైనే పోలీసులతో గౌరవవందనం స్వీకరించి, జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి దేశంలో ఒక్క లోకేశే' అని దీనికి సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేశారు. ఇది ఆయన బద్దకాన్ని, అధికార దుర్వినియోగానికి నిదర్శనమని పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అటు చంద్రబాబు కోడలు బ్రాహ్మణిని రాహుల్ గాంధీ కలవడం దేనికి సంకేతం అని ఆయన ప్రశ్నించారు. రాహుల్‌గాంధీకి నీచ రాజకీయాలు మాత్రమే తెలుసని, ఎంతకైనా దిగజారతారని చంద్రబాబు కోడలిని కలిశాక అర్థమవుతోందని అని ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నాడు రాహుల్‌గాంధీ అధికార దురహంకారంతో కేసులు పెట్టించి గతంలో జైలుకు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.