AP: విజయవాడ విమానాశ్రయంలో కొత్త రన్ వేకు డీజీసీఏ అనుమతి
ఏపీలో ఇక ఎయిర్ ట్రాఫిక్ మరింతగా పెరగనుంది. కొత్తగా అందుబాటులో వస్తున్న విమానాశ్రయాలకు తోడు..విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త రన్ వేకు డీజీసీఏ అనుమతివ్వడంతో ట్రాఫిక్ మరింతగా పెరగబోతోంది.
ఏపీ ( AP ) లో ఇక ఎయిర్ ట్రాఫిక్ మరింతగా పెరగనుంది. కొత్తగా అందుబాటులో వస్తున్న విమానాశ్రయాలకు తోడు..విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త రన్ వేకు డీజీసీఏ అనుమతివ్వడంతో ట్రాఫిక్ మరింతగా పెరగబోతోంది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ( Vijayawada international Airport ) లో నిర్మించిన కొత్త రన్ వే పూర్తయింది. 125 కోట్ల ఖర్చుతో 1 వేయి 74 మీటర్ల మేర ఈ కొత్త రన్ వేను నిర్మించారు. విజయవాడ విమానాశ్రయంలో ఇప్పటికే 2 వేల 286 మీటర్ల మేర ఉన్న పాత రన్ వేకు ఇది ఇదనం. పాత రన్ వేపై ఇప్పటికే పలు విమానాల టేకాఫ్, ల్యాండింగ్ జరుగుతోంది.
విజయవాడ విమానాశ్రయానికి పెరుగుతున్న ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకుని కొత్త రన్‌వే ( New Runway ) నిర్మించారు. ఇది అందుబాటులోకి రావడంతో విమానాశ్రయం మొత్తం రన్ వే పొడవు 3 వేల 360 మీటర్లకు చేరుకుంది. ఈ కొత్త రన్ వేపై ట్రయల్ రన్ ( Trial Run) కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA ) అనుమతిచ్చింది. ఈ నెలాఖరుకు కొత్త రన్‌వేపై విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌ల ట్రయల్ రన్ పూర్తి కానుంది. ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయ్యాక... దేశీయ, అంతర్జాతీయ విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌కు అనువైనదిగా గుర్తింపు వస్తుంది.
ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కడప విమానాశ్రయాలకు తోడు కర్నూలు విమానాశ్రయం కూడా అందుబాటులో రావడం, విజయవాడ కొత్త రన్ వే నిర్మాణంతో ఏపీలో ఎయిర్ ట్రాఫిక్ ( Air traffic ) మరింతగా పెరగనుంది. Also read: Fact Check: ఏపీలో 32 కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయా?