Vijayawada Pregnant Women: నొప్పులు వస్తున్నా పట్టించుకోని ప్రభుత్వ వైద్య సిబ్బంది.. నేలపై బిడ్డను ప్రసవించిన గర్భిణి!
Vijayawada Pregnant Women gave birth to a child on the floor. నిండు గర్భిణీ పట్ల విజయవాడ ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది దారుణంగా వ్యవహరించింది. నొప్పులు వస్తున్నా.. అస్సలు పట్టించుకోలేదు. దాంతో నేలపై బిడ్డను ప్రసవించింది ఓ గర్భిణి.
Vijayawada Pregnant Women gave birth to a child on the floor: దేశంలోని ప్రభుత్వ వైద్య సిబ్బంది తీరు రోజురోజుకు దారుణంగా మారుతోంది. ఎక్కడ చూసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోగులు అత్యవసర పరిస్థితిలో ఉన్నా.. అస్సలు పట్టించుకోవడం లేదు. చికిత్స అందించక పోగా.. పేషేంట్స్ పైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు నిండు గర్భిణీలు నొప్పులతో ఆసుపత్రికి వచ్చినా కనికరం కూడా చూపడం లేదు. తాజాగా ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్య ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. నిండు గర్భిణీ పట్ల విజయవాడ ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది దారుణంగా వ్యవహరించింది.
వివరాల ప్రకారం... నిండు గర్భిణి ప్రసవం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. నొప్పులు ఎక్కువగా ఉన్నాయని చెప్పినా వారు పట్టించుకోలేదు. కనీసం పైకి నడవలేని పరిస్థితిలో ఉండడంతో.. స్ట్రక్చర్ తీసుకురమ్మని పలుసార్లు సిబ్బందిని గర్భిణి కుటుంబీకులు అడిగినా నిమ్మకునీరెత్తినట్లు ఉన్నారు. పైగా రూల్స్ మాట్లాడుతున్నారేంటంటూ బంధువులపైనే వైద్య సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసింది. చేసేదేంలేక అందరూ ఆసుపత్రి ముందే ఉండిపోయారు.
నొప్పులు ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రి ముందే గర్భిణి వాంతులు చేసుకుంది. అలా వాంతులు చేసుకుంటుండగా.. కడుపు నుంచి శిశువు ఒక్కసారిగా జారి నేలపై పడింది. దాంతో శిశువు తల నేలకు తగిలి.. బొడ్డు తెగిపోయి తీవ్ర రక్తస్రావం అయింది. దాంతో అందరూ ఆందోళన చెందారు. ఈ ఘటనకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన విజయవాడ ప్రభుత్వ వైద్యశాల సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?
Also Read: Deepika Pilli: పొట్టి గౌనులో దీపికా పిల్లి రచ్చ.. షర్ట్ బటన్లు విప్పేసి.. వామ్మో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.