Woman constable death : చిన్న వయసులోనే ఆ యువతి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి తన కలను సాకారం చేసుకుంది. దీంతో తల్లిదండ్రులు ఇక ఆమెకు పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఇటీవలే ఓ సంబంధం చూసి వివాహం ఖాయం చేశారు. ఈ నెల 28న వివాహం జరగాల్సి ఉంది. కానీ ఇంతలోనే బ్లడ్ క్యాన్సర్ (Blood Cancer) రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. పెళ్లి పీటలెక్కి కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన కూతురు ఇలా హఠాన్మరణం చెందడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా (Krishna district) ఉంగుటూరు మండలం నందమూరి గ్రామానికి చెందిన శ్రీరమ(21) 19 ఏళ్ల వయసులోనే కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. ప్రస్తుతం విజయవాడలోని (Vijayawada) అజిత్‌సింగ్ నగర్‌ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తోంది. కూతురు ఉద్యోగంలో స్థిరపడటంతో ఆమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఇటీవలే ఓ సంబంధం ఖాయం చేశారు. ఈ నెల 28న వివాహం జరిపించాల్సి ఉంది. 


Also Read: ఖబడ్దార్... విర్రవీగితే మెడలు వంచుతాం... వైసీపీ నేతలకు నందమూరి బాలకృష్ణ వార్నింగ్


కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో ఉండగానే శ్రీరమ్య అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. వైద్య పరీక్షలు చేయించుకోగా ఆమెకు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లుగా నిర్దారణ అయింది. దీంతో వైద్యుల సూచన మేరకు మందులు వాడుతోంది. ఇదే క్రమంలో బుధవారం (నవంబర్ 17) పోలీస్ స్టేషన్‌లో విధుల్లో ఉండగానే ఉన్నట్టుండి కుప్పకూలింది. చెవులు, ముక్కులో నుంచి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే పోలీస్ స్టేషన్ సిబ్బంది చికిత్స నిమిత్తం ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ (Hyderabad) తరలించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి దాటాక శ్రీరమ్య మృతి చెందింది. పెళ్లి పీటలెక్కాల్సిన కూతురు ఇలా హఠాన్మరణం చెందడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. శ్రీరమ్య అంత్యక్రియల్లో అజిత్‌సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌ (AP Police) సిబ్బంది పాల్గొని నివాళులు అర్పించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook