Electricity Bill Payment: కరెంట్ బిల్లు చెల్లించారా..? ఈ తప్పును అస్సలు చేయకండి
Power Bill Cyber Cheating: తూర్పు గోదావరి జిల్లా ఉండి మండలంలో ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల ఉచులో పడిపోయాడు. కరెంట్ బిల్లు పేరుతో రూ.1.82 లక్షలు పోగొట్టుకున్నాడు. అది కూడా ఆలస్యంగా గుర్తించి.. పోలీసులను ఆశ్రయించాడు.
Power Bill Cyber Cheating: సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. చిన్న అవకాశం దొరికినా.. అమాయకులను నిండా ముంచుతున్నారు. గుర్తుతెలియని కాల్స్‌కు స్పందించవద్దని అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా.. అనవసరంగా స్పందిస్తూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా కరెంట్ బిల్లు చెల్లించిన వ్యక్తికి కేటుగాళ్లు ఓ మెసేజ్ పంపించి గాలం వేశారు. సైలెంట్‌గా అకౌంట్‌ను ఖాళీ చేసేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పూర్తి వివరాలు ఇలా..
పెదపుల్లేరు గ్రామానికి చెందిన కలిదిండి బలరామ కృష్ణంరాజు మార్చి నెలలో కరెంట్ బిల్లును చెల్లించాడు. అయితే అదే నెల 28న కరెంట్ బిల్లు చెల్లించాలని ఆయన మొబైల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తామని అందులో హెచ్చరించారు. దీంతో అందులో పేర్కొన్న నంబరుకు కృష్ణంరాజు ఫోన్ చేశారు. తాను ఇప్పటికే కరెంట్ బిల్లు చెల్లించానని చెప్పగా.. అవతలి వ్యక్తి ఓ లింక్ పంపిస్తానని అందులో చెక్ చేసుకోవాలని సూచించాడు. దీంతో అతను పంపించిన లింక్‌పై బాధితుడు క్లిక్ చేశాడు.
అయితే కరెంట్ బిల్లుకు సంబంధించిన సమాచారం ఏదీ రాలేదు. మళ్లీ ఫోన్ చేసి గుర్తుతెలియని వ్యక్తికి విషయం చెప్పాడు. తాను చెప్పిన నంబరుకు యాప్ ద్వారా రూ.5 చెల్లిస్తే పూర్తి సమాచారం వస్తుందని నమ్మించాడు. అతను చెప్పినట్లే రూ.5 పంపించగా.. కరెంట్ బిల్లు సమాచారం ఏదీ రాలేదు. తరువాత కృష్ణంరాజు పట్టించుకోలేదు. ఇక ఇటీవల బ్యాంకు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేసుకోగా.. రూ.1.82 లక్షలు డ్రా అయినట్లు తెలిసింది. మార్చి 28వ తేదీన డబ్బులు డ్రా అయ్యాయని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. దీంతో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు.. వెంటనే పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాల్స్, మెసేజ్‌లు, లింక్స్‌కు స్పందించకూడదని చెప్పారు. కొందరు అత్యాశకుపోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారని.. అనుమానం ఉంటే తమకు సమాచారం అందివ్వాలని చెబుతున్నారు.
Also Read: Ind Vs WI 5th T20 Highlights: మోస్ట్ ఓవర్‌రేటెడ్ ప్లేయర్.. హార్థిక్ పాండ్యాను ఆడుకుంటున్న ఫ్యాన్స్
Also Read: Independence Day 2023: హైదరాబాద్ వాసులకు ముఖ్యగమనిక.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి