Vizag Steel Plant Issue: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రారంభమైన విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా జరుగుతున్న ఉద్యమం ఇకపై మరింత ఉధృతం కానుంది. స్టీల్‌ప్లాంట్ ఉద్యమాన్నిత మరింత ఉధృతం చేస్తామని ఉక్కు పరిరక్షణ సమితి వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు(Visakha steelplant privatisation)లో నినాదాలు చేసి ప్రభుత్వ వాదన విన్పించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెబుతున్నారు.ఈ నేపధ్యంలో విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నామని ఉక్కు పరిరక్షణ సమితి ప్రకటించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకుని..స్టీల్‌ప్లాంట్‌కు గనులు కేటాయించాలని డిమాండ్ చేసింది. కొత్త పరిశ్రమల్ని ఇవ్వకుండా..ఉన్న పరిశ్రమల్ని ప్రైవేట్‌పరం చేయడం దారుణమని ఉక్కు పరిరక్షణ సమితి నేతలు స్పష్టం చేశారు. 


ఏపీకు మణిహారంగా ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌(Vizag Steel Plant)ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. వేలాది కోట్ల విలువైన ప్లాంట్‌ను కారుచౌకగా కేంద్రం అమ్మేస్తోందని..ఈ అంశంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిని కలుస్తామని సమితి నేతలు తెలిపారు.రానున్న రోజుల్లో దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెల్లడించారు.దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను త్వరలోనే రూపొందిస్తామన్నారు. 


Also read: Visakha steelplant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో కీలక పరిణామాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook