Food Poisoning In School: ఫుడ్ పాయిజన్ వల్ల 70 మంది విద్యార్థినులకు అస్వస్థత
Food Poisoning In School: విశాఖ మన్యం పాడేరు కేజీబీవీ పాఠశాలలో 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి భోజనం చేసిన అనంతరం వాంతులు, కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు. సిబ్బంది హుటాహుటిన బాధితులను పాడేరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్ చంద్రకళ తెలిపారు.
Food Poisoning In School: విశాఖపట్నంలోని పాడేరులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి తన హాస్టల్ మెస్ లో భోజనం చేసి ఫుడ్ పాయిజన్ కావడం వల్ల సుమారు 70 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలైనట్లు అధికారులకు సమాచారం అందింది. బాలికలకు వాంతులు, అస్వస్థతతో బాధపడుతున్న పిల్లలను వెంటనే ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది.
“సోమవారం అర్థరాత్రి దాదాపు 70 మంది విద్యార్థులు వాంతులు బారిన పడ్డారు. దీంతో అస్వస్థతకు గురైన విద్యార్థినులకు ఆస్పత్రికి తరలించాం. విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. వైద్యులు ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. సోమవారం రాత్రి భోజనం తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిసింది. ఫుడ్ పాయిజన్ వల్లే ఇది జరిగిందని మేము అనుమానిస్తున్నాం” అని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్ చంద్రకళ తెలిపారు.
Also Read: అసెంబ్లీలో బీసీ జనగణన తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి వేణుగోపాల కృష్ణ
Also Read: సీఎం జగన్ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు: జనసేనాని పవన్ కల్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook