Viveka Murder Case: వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ జరగాల్సిన సీబీఐ విచారణ వాయిదా పడింది. ఇవాళ్టి విచారణకు హాజరుకావల్సిందేనన్న సీబీఐ వెనక్కి తగ్గడంతో పులివెందులలో ఉత్కంఠత తొలగింది. ఇక ఈ నెల 10వ తేదీన అవినాష్ రెడ్డి విచారణకు హాజరుకావల్సి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివేకా హత్యకేసులో ఇవాళ అత్యంత కీలక పరిణామం చోటుచేసుకోవల్సి ఉంది. ఇవాళ అంటే మార్చ్ 6వ తేదీన మరోసారి అవినాష్ రెడ్డిని విచారణకు రావల్సిందిగా సీబీఐ నోటీసులు పంపించింది. దాంతో ఈసారి అరెస్టు తప్పదనే వార్తలు వ్యాపించాయి. అయితే వ్యక్తిగత కారణాలతో ఇవాళ్టి విచారణకు హాజరుకాలేనని..7వ తేదీ తరువాత ఎప్పుడైనా హజరౌతానని అవినాష్ రెడ్డి స్పందించారు. అయితే సీబీఐ అధికారులు మాత్రం ససేమిరా అన్నారు. ఇవాళ అంటే మార్చ్ 6వ తేదీ విచారణకు హాజరుకావల్సిందేనని స్పష్టం చేశారు. 


సీబీఐ నిరాకరించినా కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం విచారణకు గైర్హాజరయ్యేందుకే నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ నుంచి కడపకు వచ్చేశారు. ఇవాళ పులివెందుల నియోజకవర్గంలో ఎంపీ అవినాష్ రెడ్డి పర్యటన కొనసాగనుంది. ఈ క్రమంలో సీబీఐ ఈ అంశాన్ని ఎలా పరిగణిస్తుందోననే ఆందోళన పెరిగింది. సీబీఐ అధికారులు నేరుగా పులివెందులకు చేరుకుని నోటీసులు ఉల్లంఘించినందుకు అరెస్టు చేస్తారా అనే అనుమానాలు పెరిగాయి. ఈ క్రమంలో పులివెందులలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.


ఇంతలో ఏం జరిగిందో కానీ సీబీఐ అధికారులు వెనక్కి తగ్గారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరుకావల్సిందిగా కోరుతూ మరోసారి నోటసులు జారీ చేశారు. పులివెందుల ఇంటికి వెల్లి నోటీసులు అందించారు. విచారణ వాయిదా పడటంతో పులివెందులలో నెలకొన్న ఉత్కంఠ పరిస్థితులు తొలిగాయి.  


వాస్తవావికి ఇవాళ జరగాల్సిన విచారణ వివేకా హత్యకేసులో అత్యంత కీలకమైంది. ఇప్పటికే రెండుసార్లు సీబీఐ అవినాష్ రెడ్డిని విచారించి కీలకమైన విషయాలపై ప్రశ్నించింది. హత్య జరిగిన సమయంలో అవినాష్ రెడ్డి ఫోన్ లొకేషన్ ఘటనా స్థలంలో చూపించినట్టుగా గూగుల్ టేకౌట్ సహాయంతో సీబీఐ గుర్తించింది. అంటే హత్య జరిగిన సమయంలో ఆయన అక్కడెందుకున్నారు, హత్యలో పాత్ర ఉందా అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు ఈ విషయమై అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సైతం సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు మూడోసారి విచారణ జరగనుంది. 


Also read: MP Avinash Reddy: రేపు విచారణకు హాజరుకాలేను.. సీబీఐకు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook