విశాఖలోని ఆర్ఆర్ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ లో రసాయన గ్యాస్ లీకేజీ ప్రమాదం బాధితులను వెంటాడుతూనే ఉంటుంది. దీర్ఘకాలంలోనూ దాని ప్రభావం చూపిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవును.. ఇదే అంశాన్ని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. విశాఖ గ్యాస్ లీకేజీ ప్రభావం.. బాధితుల ఆరోగ్యాన్ని దీర్ఘకాలికంగా దెబ్బతీస్తూనే ఉంటుందని 'సీఎస్ఐఆర్'-'ఎన్ఈఈఐఆర్' నిపుణులు తేల్చి చెప్పారు. ప్లాంట్ లో ప్రమాద ఘటన తర్వాత ఈ రెండు బృందాలు పర్యటించి ఆధారాలు సేకరించాయి. ఆ తర్వాత ఓ నివేదికను సిద్ధం చేశాయి. 


ఐతే 'సీఎస్ఐఆర్'-'ఎన్ఈఈఐఆర్' నిపుణులు ఇచ్చిన నివేదికను వైసీపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. బాధితులకు భవిష్యత్ లో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలన్నింటిపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని వెల్లడించారు. ఇప్పటికే బాధితుల ఆరోగ్యంపై పూర్తి బాధ్యత తీసుకుని ప్రభుత్వం వారందరినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చిందని స్పష్టం చేశారు. అంతే కాకుండా బాధితులకు రాబోయేకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు ఎలాంటివైనా, ఎంతటివైనా జీవితకాలం ఉచితంగా  వైద్య చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తామని భరోసా ఇచ్చారు.


[[{"fid":"185510","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ప్రజలక్షేమమే ప్రథమ కర్తవ్యమని భావించే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని మంత్రి మేకపాటి చెప్పారు. అందుకే స్టైరిన్ తరలించేందుకు ఆదేశాలిచ్చారని వెల్లడించారు. ఎల్జీ పరిశ్రమ ప్రాంగణంలో ఉన్న 13వేల టన్నుల స్టైరిన్ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాలానుసారం దక్షిణ కొరియాకు తరలిస్తున్నామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. అలాగే రాష్ట్రలో మరో ప్రమాదానికి అవకాశం లేకుండా 13 జిల్లాలలో అనుమానం ఉన్న అన్ని పరిశ్రమలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు.  ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..