Vizag Sai Priya Missing Case: విశాఖపట్నంలో సంచలనం రేపిన సాయిప్రియ అనే వివాహిత మిస్సింగ్ కేసు అనూహ్య మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. తాజాగా సాయిప్రియ ప్రియుడితో కలిసి విశాఖలో అడుగుపెట్టింది. బెంగళూరులో ప్రియుడిని పెళ్లి చేసుకుని.. అతనితో పాటు విశాఖకు వచ్చింది. మొదట విశాఖ ఎయిర్‌పోర్ట్ పోలీసుల వద్దకు వెళ్లి.. తాను మరో పెళ్లి చేసుకున్నానని, ఇకపై అతనితోనే ఉంటానని చెప్పింది. ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న విశాఖ మూడో టౌన్ పోలీసులకు ఎయిర్‌పోర్ట్ పోలీసులు సమాచారం అందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం ఆ జంటను విశాఖ మూడో టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాయిప్రియ తల్లిదండ్రులను, ఆమె ప్రియుడి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. తమకు ఎటువంటి హానీ కలగకుండా చూడాలని ఈ సందర్భంగా సాయిప్రియ, ఆమె ప్రియుడు పోలీసులను కోరారు. మరోవైపు, ఇద్దరి తల్లిదండ్రులు మాత్రం ఈ పెళ్లిని ఒప్పుకోమని చెప్పినట్లు తెలుస్తోంది. ఇకపై వారితో తమకెటువంటి సంబంధం లేదని చెప్పి వారు వెళ్లిపోయినట్లు సమాచారం.


సాయిప్రియ మేజర్ కావడంతో పోలీసులు కూడా ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం లేకపోయింది. అయితే చట్టప్రకారం మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా ఇంకొకరిని వివాహం చేసుకోవడం నేరం కాబట్టి..  దానిపై పోలీసులకు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు వెళ్లిపోయిన కాసేపటికే సాయిప్రియ, ఆమె ప్రియుడు కూడా పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. ఇకపై తాము తల్లిదండ్రుల వద్దకు వెళ్లమని, వేరుగానే ఉంటామని చెప్పారు. అంతేకాదు, తమవల్ల ఇబ్బందిపడినవారందరికీ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.


అసలేంటీ కేసు :


సాయిప్రియ-శ్రీనివాసరావులకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. శ్రీనివాసరావు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుండటంతో ఇక్కడే కాపురం పెట్టాడు. జూలై 25న ఈ జంట పెళ్లి రోజు. సాయిప్రియ కోరిక మేరకు సరదాగా గడిపేందుకు శ్రీనివాసరావు ఆమెను విశాఖ ఆర్కే బీచ్‌కు తీసుకెళ్లాడు. కానీ అక్కడికి వెళ్లిన కాసేపటికే సాయిప్రియ అదృశ్యమైంది. సముద్రంలో గల్లంతైందేమోనని ఆందోళన చెందిన శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నేవీ కోస్ట్ గార్డ్ సహాయంతో పోలీసులు సముద్రంలో ఆమె కోసం గాలించారు. ఇందుకోసం దాదాపు రూ.1కోటి ఖర్చు చేశారు.


కానీ సాయిప్రియ అందరికీ షాకిస్తూ తాను బెంగళూరులో తన ప్రియుడిని పెళ్లి చేసుకున్నానని.. తన కోసం వెతకవద్దని సమాచారమిచ్చింది. దీంతో సాయిప్రియ భర్తతో పాటు ఆమె కోసం గాలిస్తున్న పోలీసులు షాక్ తిన్నారు. ఇదే క్రమంలో తాజాగా ప్రియుడితో కలిసి విశాఖకు వచ్చింది సాయిప్రియ. సాయిప్రియ విశాఖకు రావడంతో మీడియా ఆమెను చుట్టుముట్టింది. ఈ క్రమంలో సాయిప్రియ స్పృహ తప్పి పడిపోయింది. కాసేపటికి మళ్లీ తేరుకుంది. తల్లిదండ్రులు ఛీత్కరించడంతో వారికి దూరంగా ఉంటామని సాయిప్రియ, ఆమె ప్రియుడు మీడియాతో చెప్పారు.


Also Read: Gold Price Today: రెండు రోజుల్లోనే భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ధరల వివరాలివే


Also Read: Shravana Shanivaram: ఇవాళ శ్రావణ మొదటి శనివారం.. ఉద్యోగ, ధన, వివాహ, సంతాన ప్రాప్తి కోసం 4 ముఖ్య పరిహారాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook