Viral video: అంబులెన్స్‌కి దారి ఇచ్చిన ఏపీ సీఎం కాన్వాయ్
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ దారి ఇచ్చిన ( AP CM YS Jagan`s convoy ) వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అమరావతి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కాన్వాయ్ దారి ఇచ్చిన ( AP CM YS Jagan's convoy ) వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 2న దివంగత మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళి అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు జరిపి తిరిగివచ్చిన సీఎం జగన్.. గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. Also read : Chandrababu: అమిత్ షాకు ఫోన్ చేసిన చంద్రబాబు
సీఎం జగన్ కాన్వాయ్ గూడవల్లి - నిడమానూరు మధ్య ఉండగా.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన చాపర్తిన శేఖర్ అనే వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్ కూడా అదే మార్గంలో రావడంతో సీఎం వైఎస్ జగన్ ఆ అంబులెన్సుకు దారి ఇచ్చారు ( CM Jagan convoy makes way for ambulance ). అంబులెన్స్‌కి దారి ఇవ్వడం ద్వారా ఆపదలో ఉన్న వారి పట్ల సీఎం జగన్ తన గొప్ప మనసును చాటుకున్నారు. Also read : Hyderabad metro rail: సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సేవలు.. తెలుసుకోవాల్సిన విషయాలు