ఏపీలో 175 స్థానాల్లో పోటీకి సిద్ధం: పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళవారం హైదరాబాదులోని పార్టీ ఆఫీసులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ మాటలు అన్నారు
జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళవారం హైదరాబాదులోని పార్టీ ఆఫీసులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ మాటలు అన్నారు. పూర్తిస్థాయి ప్లానింగ్‌తో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రాస్ రూట్ లెవల్ నుండి రాష్ట్ర స్థాయి సమస్యల వరకు పోరాడాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
జనసేన పార్టీ పొలిటికల్ ప్లానర్ దేవ్‌ను ఆయన తన పార్టీ వాలంటీర్లకు ఈ సందర్భంగా పరిచయం చేశారు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు.. జరిగాక కూడా దేవ్ సేవలు జనసేనకి అవసరమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రతో పాటు తెలంగాణలో కూడా పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జనసేన వేస్తున్న అడుగు తొలి రాజకీయ అడుగు కాదని.. తమ పార్టీ కార్యకర్తలకు రెండు ఎన్నికలకు సంబంధించిన అనుభవం ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు.