Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో వాన జోరు కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణలను వర్షాలు ఇప్పట్లో వీడేలా లేవు.  గత కొన్ని రోజులుగా ఈ రెండు రాష్ట్రాలు భారీ వర్షాలతో (Heavy rains)అతలాకుతలమవుతున్నాయి. తాజాగా మరో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. మరో నాలుగు రోజులు పాటు వర్ష సూచన ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణపై ఉత్తర, దక్షిణ ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని.. దీని ప్రభావంతో మరో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడాజారీ చేశారు. ఇప్పటికే భారీ వర్షాలతో భాగ్యన‌గ‌రం త‌డిసి ముద్దయింది. ఆంధ్రప్రదేశ్ లో రానున్న నాలుగు రోజులపాటు వానలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 


నార్త్ ఇండియాలో కూడా వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఈ వర్షాల కారణంగా యోగి సర్కారు విద్యాసంస్థలకు సెలవు ప్రకిటంచింది. ఉత్తరాఖండ్, ఢిల్లీ, రాజస్థాన్‌, హర్యాణా రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంబించింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కుండపోత వర్షాలకు దేశంలోని పలుచోట్ల కొండ చరియలు విరిగి పడుతున్నాయి. 


Also read: TSPSC Group 1: వెబ్‌సైట్లో గ్రూప్-1 హాల్‌టికెట్లు.. డౌన్‌లోడ్ చేసుకోండిలా.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3P3R74U 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook