వైసీపీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వెనక పలువులు సీనియర్ ఐఏఎస్ ల హస్తం ఉందని గురువారం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఆయన విమర్శలు ఎలా ఉన్నప్పటికీ ఉన్నట్టూండి ఇప్పుడే ఆ ప్రస్తావన విజయసాయి ఎందుకు తెచ్చినట్లు.. ? అనే ప్రశ్న రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. వైసీపీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరిన తర్వాత   ప్రతిపక్షం నుంచి కొత్తగా అధికార పార్టీలోకి వచ్చిన వారూ లేరు. గత కొన్ని నెలలుగా వైసీపీ ఎమ్మెల్యేలెవరూ తెలుగుదేశం పార్టీలో చేరలేదు. అప్పుడేమీ మాట్లాడని వైసీపీ.. ఇప్పుడెందుకు హఠాత్తుగా సీఎం కార్యాలయ అధికారులపై ఆరోపణలు ఎందుకు చేస్తుందనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందూ టెక్‌జోన్‌ కుంభకోణం కేసులో సీబీఐ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై చార్జిషీటు దాఖలుచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇందూ టెక్‌ జోన్‌ పనులు నిలిచిపోయాయి. దీంతో ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టి తాము మోసపోయామని మారిషస్‌ కంపెనీ తాజాగా భారత ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం..జాతీయ స్థాయిలో ఈ అంశంపై చర్చ జరుగుతోంది . ఈ నేపథ్యంలో దీన్నుంచి దృష్టి మళ్లించేందుకే వైసీపీ నేత విజయసాయి హఠాత్తుగా ఈ ఆరోపణలు చేస్తున్నారని రాజకీయవర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కాగా మరోవైపు సీఎం కార్యాలయ అధికారులపైనే దాడి చేయడం ద్వారా సీఎం చంద్రబాబును బలహీనపరచాలనే వ్యహాంతో ఈ ఆరోపణలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.


ఎవరి వాదనలు ఎలా ఉన్నా..ఉన్నతాధికారులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చర్చనీయశంగా మారాయి.