Chandrababu Naidu Plot Bribe: ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల అవినీతి శ్రుతిమించుతోంది. పేదలను పట్టి పీడిస్తున్న అధికార యంత్రాంగం వీవీఐపీలను కూడా వదలడం లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి సంబంధించిన స్థలం విషయంలో కూడా అవినీతికి పాల్పడ్డారు. స్థలం విషయమై ఓ అధికారి లంచం అడిగారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అవినీతికి పాల్పడ్డ ఆ అధికారిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ వార్త ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలనం.. 9 నెలల యువతి కేసు 9 రోజుల్లో పరిష్కారం


 


చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం. ఎనిమిది సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే కుప్పంలో సొంత ఇళ్లు లేకపోవడంతో తీవ్ర రాజకీయ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కుప్పంలో కొన్నేళ్ల కిందట ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. అయితే ఇంటి స్థలాన్ని సబ్‌ డివిజన్‌ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్‌ లంచం తీసుకున్నారు. అప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.

Also Read: C Naga Rani IAS: వెస్ట్‌ గోదావరికి పవర్‌ ఫుల్‌ ఆఫీసర్‌.. ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే అందరికీ హడలే


 


శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద చంద్రబాబు స్థలాన్ని కొనుగోలు చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో గృహ నిర్మాణం చేసేందుకు తెలుగుదేశం నాయకులు భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు ఇచ్చారు. అయితే స్థలాన్ని సబ్‌ డివిజన్‌ చేయాలని కోరగా నాటి డిప్యూటీ సర్వేయర్‌ సద్దాం హుస్సేన్‌ రూ.1.80 లక్షల లంచాన్ని డిమాండ్‌ చేశారు. అడిగిన మొత్తం డబ్బులు ఇవ్వడంతోనే చంద్రబాబు భూమికి సంబంధించిన ఫైల్‌ ముందుకు కదిలింది. అనంతరం ఇంటి నిర్మాణం ప్రారంభించారు.


అయితే కాలం అనూహ్యంగా తిరిగింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయ్యాక తొలిసారి గత నెల 25, 26వ తేదీల్లో చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. ఆ సమయంలో ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో బస చేయగా.. స్థానిక నాయకులు లంచం వ్యవహారం గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ సుమిత్‌కుమార్, సంయుక్త కలెక్టర్‌ శ్రీనివాసులకు ఫిర్యాదు చేశారు. సర్వే శాఖ ఏడీ గౌస్‌బాషాతో చేసిన సర్వేలో సద్దాం హుస్సేన్‌ లంచం విషయం వాస్తవేమేనని తేలింది.


అయితే ఇదే క్రమంలో గత నెల 27న శాంతిపురం మండలానికే చెందిన ఓ రైతు కూడా డిప్యూటీ సర్వేయర్‌ అవినీతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తనకు సద్దాం రూ.లక్ష లంచం డిమాండ్‌ చేశారని ఫిర్యాదు చేయడంతో జేసీ శ్రీనివాసులు విచారణ చేశారు. అవినీతికి పాల్పడుతున్నాడని గుర్తించి సోమవారం డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్‌‌ను జాయింట్‌ కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. ప్రతిపక్ష నాయుడి నివాసానికే ఇంతటి లంచం బెడద తప్పలేదా? అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. వీఐపీలకే లంచం బెడద ఉంటే ఇక సామాన్యుల కష్టం ఎవరికీ చెప్పుకోవాలని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి