AP Soldiers Dead Bodies: జమ్మూకశ్మీర్‌లో జరిగిన అనూహ్య సంఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు సైనికులు మృత్యువాత చెందారు. లఢఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురులో ముగ్గురు ఏపీకి చెందిన వారే ఉండడం తీవ్ర విషాదం నింపింది. ప్రమాదం జరిగిన రెండు రోజుల అనంతరం సైనికుల మృతదేహాలు ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నాయి. కాగా ఈ సంఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: NTR Bharosa Pension: ఆంధ్రప్రదేశ్‌ పింఛన్ల పంపిణీలో దొంగతనం.. వృద్ధులకు ఇవ్వాల్సిన రూ.4 లక్షలు చోరీ


తూర్పు లఢఖ్‌లోని సాసర్‌ బ్రాంగ్సా సమీపంలో షియోక్‌ నదీ ప్రవాహంలో శనివారం ఆర్మీ ట్యాంకు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం ఐదురుగు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. విధుల నిర్వహణ కోసం వాస్తవాధీన రేఖ సమీపంలో టి-72 యుద్ధ ట్యాంకులో వెళుతున్నప్పుడు ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి (జేసీఓ) ముత్తుముల రామకృష్ణారెడ్డి మృతిచెందారు. కృష్ణా జిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామానికి చెందిన సైనికుడు సాదరబోయిన నాగరాజు (32) మరణించారు. ధనలక్ష్మి, వెంకన్నల కుమారుడైన నాగరాజుకు ఐదేళ్ల కిందట మంగాదేవితో వివాహమైంది. వారికి ఏడాది పాప ఉంది. నాగరాజు సోదరుడు శివయ్య కూడా సైనికుడిగా సేవలందిస్తున్నారు. 

Also Read: TDP Toll Free: మీ సమస్య సీఎం చంద్రబాబుకు చెప్పాలా? అయితే ఈ నంబర్‌కు ఫోన్‌ చేయండి


బాపట్ల జిల్లా రేపల్లే మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన సుభాన్ ఖాన్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. 17 ఏళ్ల కిందట సైనికుడిగా చేరి అంచెలంచెలుగా హవల్దార్ స్థాయికి సుభాన్‌ ఖాన్‌ ఎదిగారు. ప్రస్తుతం సైన్యంలో ఈఎంఈ మెకానికల్ విభాగంలో పని చేస్తున్నారు. ఇస్లాంపూర్‌లో సుమారు వంద ఇండ్లు ఉండగా దాదాపు ప్రతి ఇంటి నుంచి ఇద్దరు సైనికులు ఉండడం విశేషం. ఇప్పుడు జరిగిన ప్రమాదంలో ఈ గ్రామానికి చెందిన సుభాన్‌ మృతి చెందడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం ఏర్పడింది.


రెండు రోజుల తర్వాత సైనికుల మృతదేహాలు ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నాయి. గన్నవరం విమానాశ్రయానికి సోమవారం చేరుకోగా.. అక్కడి ప్రత్యేక ఆర్మీ వాహనాల్లో మృతుల స్వస్థలాలకు తరలించనున్నారు. అక్కడ అధికారిక లాంఛనాలతో దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. కాగా సైనికుల మృతిపై ఇంకా ఏపీ ప్రభుత్వం స్పందించలేదు. విషయం తెలుసుకున్న అనంతరం మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం సంతాపం తెలిపే అవకాశం ఉంది. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం కూడా ప్రకటించనున్నట్లు సమాచారం.

రూ.కోటి పరిహారం ఇవ్వండి
లద్దాఖ్‌ ఘటనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. జవాన్ల మృతిపై విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. దేశ రక్షణలో వారి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు. జవాన్ల కుటుంబానికి రూ.కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కోరారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter