Baby Boy In Vijayawada Floods: ఎక్కడ చూసినా వరదతో ఇంటి నిండా నీళ్లు.. కంటి నిండా నీళ్లతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఉన్నారు. ఎటు చూసినా దయనీయ పరిస్థితి. వరద సహాయ చర్యల్లో నిమగ్నమైన సమయంలో ఒక శుభ పరిణామం చోటుచేసుకుంది. వరదలో చిక్కుకున్న ఓ గర్భిణి పురిటినొప్పులతో విలవిలలాడింది. సహాయ చర్యల్లో పాల్గొంటున్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) వెంటనే స్పందించి బోటును తీసుకెళ్లింది. అయితే ఆ బోటులోనే మహిళ పండంటి బాబుకు జన్మనిచ్చింది. దీంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: AP Floods: విజయవాడ వరదలపై ఏం చేయలేం! భారమంతా దేవుడిపైనే..


జలదిగ్బంధంలో చిక్కుకున్న విజయవాడ లో సోమవారం సహాయ చర్యలు ముమ్మరమయ్యాయి. రాష్ట్ర అధికార యంత్రాంగంతోపాటు ఎన్‌డీఆర్‌ఎఫ్‌తోపాటు భారత సైన్యం రంగంలోకి దిగింది. ఎక్కడికక్కడ బాధితులను ఆదుకునేందుకు సహాయ చర్యలు ఆయా దళాలు చేపట్టాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం.. పునరావాస కేంద్రాలు ఏర్పాటు.. బాధితులకు ఆహారం.. నీళ్లు అందించడం వంటివి వెనువెంటనే జరిగాయి.


Also Read: Chandrababu: ప్రజల కోసం చంద్రబాబు బావమరిది ప్రోగ్రామ్‌ రద్దు.. బస్సులోనే నిద్ర


ఈ క్రమంలోనే విజయవాడలోని వైఎస్సార్‌ కాలనీ లో వరదలో గర్భిణి ఎస్‌కే షకీలా చిక్కుకున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సోమవారం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం బోటుతో అక్కడకు వెళ్లింది. అయితే షకీలా పురిటినొప్పులతో బాధపడుతున్నారని గుర్తించి వెంటనే 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, 108 సిబ్బంది కలిసి ఆమెకు బోటులోనే ప్రసవం చేశారు. వరదలోనే షకీలా ఓ బాబుకు జన్మనిచ్చింది. దీంతో స్థానికంగా అందరిలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆమెను కాపాడిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌, 108 సిబ్బందికి షకీలా కృతజ్ఞతలు తెలిపారు.


అక్కడి నుంచి తల్లి షకీల, నవ జాత శిశువును విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అయితే తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండడం విశేషం. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన తెలిసి నెటిజన్లు ప్రశంసలు కురుస్తున్నారు. అయితే ఆ బాబుకు ఏం పేరు పెడతారని అందరూ చర్చించుకుంటున్నారు. కొందరు పేర్లు కూడా పెడుతున్నారు. వరదలో పుట్టడంతో 'వరదరాజు' అని పెడదామని సూచిస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter