Chandrababu Naidu vs Revanth Reddy: కనీవిని ఎరుగని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడుకు ఊహించని రీతిలో ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి మూడు రోజులే అయ్యింది. సీఎంగా బాధ్యతలు చేపట్టి 24 గంటలు కూడా కాలేదు. కానీ అప్పుడే చంద్రబాబు పనితీరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రశంసలు కురిపించేది సొంత పార్టీ వారు అయితే గొప్పేముంది. కానీ ప్రత్యర్థి పార్టీ వాళ్లు.. పక్క రాష్ట్రం వాళ్లు బాబు తీరును మెచ్చుకుంటూ వ్యాఖ్యలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read; Vote Percentage: తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌.. వైఎస్సార్‌సీపీకి కలిసొచ్చిన అదృష్టం


అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీకి పట్టం కట్టడంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే చంద్రబాబు ప్రత్యేకతను చాటారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను నిలబెట్టుకున్నారు. సీఎంగా తొలి ఐదు సంతకాలు తాను ఇచ్చిన హామీలపైనే చేశారు. వాటిలో మెగా డీఎస్సీ, పింఛన్ల పెంపు ఉన్నాయి. అయితే చంద్రబాబు మాట నిలబెట్టుకోవడంపై పక్క రాష్ట్రం తెలంగాణలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అక్కడి ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ.. చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ఆయనే కాకుండా అక్కడి బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి కూడా ప్రశంసించారు.

Also Read: Arudra Help: నాడు జగన్‌ పట్టించుకోలేదు... నేడు ఆరుద్రను అక్కున చేర్చుకున్న చంద్రబాబు


అయితే వారిద్దరూ చంద్రబాబును పొగుడుతూనే అక్కడి ముఖ్యమంత్రిని దెప్పి పొడిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా నెరవేర్చడం లేదని మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో మీ గురువు చంద్రబాబును చూసి నేర్చుకోవాలంటూ హితవు పలికారు. బాబు ముఖ్యమంత్రి అయ్యాక మెగా డీఎస్సీ, ఫించన్ల పెంపు చేపట్టారని రేవంత్‌ రెడ్డికి గుర్తు చేస్తున్నారు. మరి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎప్పుడు పింఛన్ల పెంపు చేస్తుందని నిలదీశారు. అంతేకాకుండా ఉద్యోగాల విషయమై కూడా చంద్రబాబును పొగుడుతూనే రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు. ఇలా గురువు చంద్రబాబును పొగుడుతూ.. శిష్యుడు రేవంత్‌ రెడ్డిపై విమర్శలు చేయడం ఆసక్తికరం. 


ఏపీలో చంద్రబాబు పాలనను మెచ్చుకుంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు 'ఎక్స్‌'లో స్పందించారు. 'పక్క రాష్ట్రం ఏపీలో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి అన్ని రకాల పింఛన్లు పెంచారు' అని తన ట్వీట్‌లో హరీశ్ రావు చంద్రబాబు విషయమై ప్రస్తావించారు. ఆయనను చూసి వెంటనే హామీలు నెరవేర్చాలని రేవంత్‌ రెడ్డిని డిమాండ్‌ చేశారు. 'ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే పింఛన్లను పెంచుతూ సంతకం చేశారు. ఎన్నికల్లో పింఛన్లు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా రేవంత్‌ రెడ్డి హామీలు నిలబెట్టుకోవడం లేదు' అని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి తెలిపారు.


నాడు విమర్శలు.. నేడు ప్రశంసలు
ఇలా తెలంగాణలో చంద్రబాబు పాలనపై ప్రశంసలు కురుస్తుండడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి దాకా తెలంగాణలో ఏపీ పరిపాలనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్స్‌ వచ్చాయి. ఇప్పుడు అలాంటి రాష్ట్రంలోనే ఏపీ పాలనను మెచ్చుకోవడం గమనార్హం. విమర్శించిన నోళ్లే ఇప్పుడు ప్రశంసించడం మాత్రం ఏపీలో పరిస్థితులు మారాయని చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

 





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter