woman Suicide attempt in naravari palle video viral: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. అయితే.. సీఎం చంద్రబాబు స్వగ్రామమైన నారావారి పల్లెలో ఒక మహిళ రచ్చ రచ్చ చేసింది. సీఎం ను కలిసేందుకు.. తిరుపతికి చెందిన యశోద ప్రయత్నించిందంట. కానీ అక్కడ సెక్యురిటీ సిబ్బంది ఆమెను అనుమతించలేదు. దీంతో ఆమె రెచ్చిపోయి.. తాను సీఎంను కల్వందే ఇక్కడ నుంచి వెళ్లేదిలేదని పోలీసులతో వాగ్వాదానికి దిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అంతటితో ఆగకుండా..  ఆమె తన చేతి గాజులు పగులగొట్టుకుని, వాటిని మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని  చంద్రగిరి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ విచారించిన తర్వాత మళ్లీ వదిలేసినట్లు తెలుస్తొంది. మరోవైపు మహిళ  ఒక్కసారిగా కేకలు వేయడంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ నెలకొంది. అసలు ఇటీవల చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మరణించిన విషయం తెలిసిందే.


ఆ విషాదంలో నారావారి పల్లె ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు ఇంటికి వారి బంధువులు, సన్నిహితులు వస్తున్నారంట.ఈ క్రమంలో మహిళ చేసిన రచ్చ మాత్రం అధికారులకు చెమటలు పట్టించిందని చెప్పుకొవచ్చు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. 


ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ మాత్రం అసెంబ్లీ సమావేశాలకు యథాతథంగా దూరంగా ఉంది . కానీ మండలి సమావేశంలో మాత్రం నేతలు పాల్గొన్నట్లు తెలుస్తొంది. ఈ  క్రమంలో మండలిలో మాత్రం.. కూటమిని.. వైసీపీ తన ప్రశ్నలతో ముప్పుతిప్పలు పెడుతున్నట్లు తెలుస్తొంది. కూటమి కూడా వైసీపీ నేతల ప్రశ్నలకు ధీటుగానే స్పందిస్తుంది. కొన్నిరోజుల క్రితం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు స్వర్గస్థులైన విషయం తెలిసిందే.


Read more: Ram Gopal Varma: ఏపీ పోలీసులకు బిగ్ షాక్.. విచారణకు అందుకే రాలేనంటూ వాట్సాప్ మెస్సెజ్ చేసిన ఆర్జీవీ..


ఈ నేపథ్యంలో ద్వాదశ దినకర్మ కూడా ఇంకా పూర్తికాలేదు. చంద్రబాబు కుటుంబ సభ్యులు..కుటుంబ సభ్యులు ప్రస్తుతం నారా వారి పల్లెలో ఉన్నట్లు తెలుస్తొంది. ఇలాంటి తరుణంలో.. ఒక మహిళ వచ్చి ఆత్మహత్యకు యత్నించడం మాత్రం చర్చకు దారితీసిందని చెప్పుకొవచ్చు. దీనిపై కొంత మంది నేతలు భిన్నంగా మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తొంది.  అసలు ఆ మహిళను ఎవరు పంపారన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారంట. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.