Crime News: ఐదేళ్ల కొడుకుతో సహా బిల్డింగ్పై నుండి దూకిన మహిళ
Crime News: సుమారు 30 అడుగుల ఎత్తు ఉన్న 2 అంతస్తుల భవనం నుండి తల్లి బిడ్డ కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లి నాయి బ్రాహ్మణ కాలనీలో చోటుచేసుకుంది. ఆ మహిళ అత్త కుప్పమ్మ , ఆడపడుచు కుమారి వేధింపులు తట్టుకోలేకే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
Crime News: సుమారు 30 అడుగుల ఎత్తు ఉన్న 2 అంతస్తుల భవనం నుండి తల్లి బిడ్డ కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లి నాయి బ్రాహ్మణ కాలనీలో చోటుచేసుకుంది. కొంగారెడ్డిపల్లి నాయి బ్రాహ్మణ కాలనీలో నివాసం ఉంటున్న సుమ (32) తన భర్త హరి చిత్తూరు నగరపాలక సంస్థలో ఉద్యోగిగా పని చేస్తూ ఈ ఏడాది ఫ్రిబ్రవరిలో మరణించాడు. ఆ ఉద్యోగం కోసం ఆరు నెలలుగా సుమ ప్రయత్నిస్తూ ఉండగా కట్ట మంచికి చెందిన ఆమె అత్త కుప్పమ్మ , ఆడపడుచు కుమారి ఆమెకు ఉద్యోగం రానివ్వకుండా నానా రకాలుగా చిత్రహింసలకు గురి చేశారు. ఈ నేపథ్యంలో మనస్థాపం చెంది గురువారం సాయంత్రం నాలుగు గంటల నాయి బ్రాహ్మణ కాలనీలో ఉన్న తన స్వగృహంలో రెండవ అంతస్తు నుండి తన ఐదేళ్ల కుమారుడు యశ్వంత్ తో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనలో ఐదేళ్ల బాలుడు యశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందగా సుమకు తీవ్ర గాయాలు అయ్యాయి. కాలనీవాసులు అందరూ కలిసి ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ ఆమె భర్త హరి చనిపోయిన తర్వాత కనీసం సాంఘ్యం చేయడానికి కూడా అత్త ఆడపడుచులు అడ్డుపడ్డారని నానా విధాలుగా ఆమెను హింసించారని తెలిపారు.
సుమ తల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకోగా బాలుడు మరణ వార్త విని మూర్చపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను తిరిగి ఆటోలో స్వగృహానికి పంపించేశారు. ఒకటవ పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ మొదలుపెట్టారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేపట్టి పూర్తి విషయాలు తెలుసుకున్న అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని చిత్తూరు పట్టణ సిఐ విశ్వనాధ్ మీడియాకు తెలిపారు.