ఆంధ్రప్రదేశ్ నిధుల అంశంపై ప్రధాన మంత్రి మోడీ ఆరోపణలు నేపథ్యంలో ఏపీలో UC రగడ నెలకొంది. వెనుకబడిన జిల్లాల నిధుల ఖర్చుకు సంబంధించిన వివరాలు (యూసీ) ఏపీ సర్కార్ పూర్తి స్థాయిలో సమర్పించలేదని బీజేపీ నేత విష్ణువర్ధన్ ఆరోపిస్తున్నారు. ఇదే సందర్భంలో యూసీలు సమర్పించామని లెక్కలతో సహా నిరూపిస్తామని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ వాదిస్తున్నారు. ఓ చర్చ వేదికగా పాల్గొన్న సందర్భంలో యూసీలు సమర్పించినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని విష్ణువర్థన్ సవాల్ చేశారు. ఈ సవాల్ ను స్వీకరించిన టీడీపీ నేత రాజేంద్రప్రసాద్..తాను నిరూపించలేకపోతే రాజీనాకు సిద్ధమంటూ ప్రతి సవాల్ విసిరారు. ఇదే అంశంపై ఇప్పటికే అగ్రనేతలు చంద్రబాబు, ప్రధాని మోడీల మధ్య కోల్డ్ వార్ నడుస్తుస్తోంది. ఇప్పుడు ద్వితియ శ్రేణి నేతలు కూడా రంగంలోకి దిగి సవాళ్లు- ప్రతిసవాళ్లకు దిగడంతో ఏపీ రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UCలు అంటే ఏంటి..ఎందుకీ రగడ ?


కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టిన నిధుల వివరాలను తెలియజేస్తూ యుటిలైజ్ సర్థిఫికెట్ (UC) సమర్పించాల్సి ఉంటుంది. వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన రూ.1050 కోట్ల నిధులకు యూసీలు సమర్పించలేదనే కారణంతో రాష్ట్రానికి తదుపరి రావాల్సిన నిధులను కేంద్రం వెనక్కి తీసుకుంది. ఈ పరిణామంపై కేంద్రంపై టీడీపీ దీని విమర్శలుకు దిగింది. కేంద్రంతో మద్దతు ఉపసంహరించుకోవడం వల్లే నిధులను వెనక్కి తీసుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. దీనికి ధీటుగా బీజేపీ కూడా స్పందిస్తోంది. UCలు సమర్పించామని టీడీపీ ..సమర్పించలేదని బీజేపీ గత కొన్ని రోజులగా ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దీనిపై ప్రధాని మోడీ బీజేపీ కార్యకర్తల సమావేశంలో మట్లాడుతూ ఏపీ సర్కార్ యూసీలు సమర్పించకపోవడం వల్లే ఆ రాష్ట్రానికి నిధులు వెనక్కి తీసుకున్నామని ప్రకటించారు.  ప్రస్తుతం ఈ విషయంపై ఇప్పుడు వివాదం నెలకొంది.  ఈ క్రమంలో నెహు యవకేంద్ర వైస్ ఛైర్మన్ పదవిలో ఉన్న బీజేపీ నేత విష్ణువర్థన్ ..టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర మధ్య మాటల యుధ్ధం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు రాజీనామా సవాళ్లు వేసుకున్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఈ వివాదం మరింత ముదిరే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.