World elephants day 2024: వాళ్లంతా రియల్ హీరోస్.. ప్రపంచ ఏనుగుల దినోత్సవం నేపథ్యంలో ఎక్స్ లో స్పందించిన డిప్యూటీ సీఎం..
Deputy cm Pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించారు. ఏనుగులను మన చరిత్రలో భాగమని, వాటిని అంతరించి పోకుండా కాపాడుకోవడం ముఖ్యమని పవన్ కల్యాణ్ అన్నారు.
Deputy cm pawankalyan comments on Elephants protection: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ఏనుగుల విషయంలో ప్రత్యేకంగా శ్రద్దను తీసుకుంటున్నారు. అంతేకాకుండా.. ఏపీలోని కొన్ని ప్రాంతాలు ఏనుగుల దాడుల వల్ల నాశనం అవుతున్నాయి. దీంతో వాటిని పొలాలు, జనావాసాల్లోకి రాకుండా పవన్ కల్యాన్ ప్రత్యేంగా చర్యలు చేపట్టారు. దీని కోసం ఏకంగా కర్ణాటకకు వెళ్లారు. అక్కడ సీఎం సిద్దరామయ్య తోపాటు, కర్ణాటక అటవీ శాఖ మంత్రిని కూడా కలిశారు. అదే విధంగా తమ రాష్ట్రానికి కుమ్కీ ఏనుగులు కావాలని కోరడం జరిగింది.
కర్ణాటక ప్రభుత్వం కూడా దీని పట్ల సానుకూలంగా స్పందించింది. ఏపీకి అతితొందరలోనే 8 కుమ్కీ ఏనుగులు రానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అడవులలో ఉండాల్సిన జంతువులు, జనాల్లోకి రావడంతో వల్ల.. కొందరు వాటిని దాడులు చేస్తున్నారు. దీంతో మూగ జీవాలు కూడా చనిపోతున్నాయి. అందుకే ఇటు అడవిలో మూగజీవాలకు ఇబ్బందులు కల్గకుండా కాపాడుకుంటునే, మరోవైపు ప్రజలకు కూడా ప్రాణ, ఆస్తుల నష్టాలు కల్గకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ఈరోజు (ఆగస్టు 12) న ప్రపంచ ఏనుగుల దినోత్సవం నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. ముఖ్యంగా ఏనుగుల్ని కాపాడటం కోసం పాటుపడుతున్న వారికి స్పెషల్ గా ధన్యవాదాలు తెలిపారు. వారే రియల్ హీరోలంటూ కూడా కొనియాడారు. ఏపీలో ఏనుగుల ఆవాసాలను కాపాడటంతో పాటు, వాటికోసం చాలా మంది ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారని పవన్ అన్నారు. అదే విధంగా కుమ్కీ ఏనుగులను తెప్పించి, అడవిలోని ఏనుగులు, బైటకు రాకుండా చర్యలు తీసుకునేందుకు ఏపీ సర్కారు నిర్ణయించింది. కుమ్కీ ఏనుగులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారు. ఇవి అడవిలో నుంచిగ్రామాల్లోకి ప్రవేశించిన ఏనుగుల మందను తిరిగి అడవిలోకి పంపిస్తాయి.
అంతేకాకుండా.. గాయపడిన ఏనుగుల్ని కాపాడి, వాటిని ట్రీట్మెంట్ ఇచ్చేలా అటవీ శాఖ అధికారులకు ఉపయోగపడతాయి. అందుకు స్పెషల్ గా కర్ణాటక నుంచి ఎనిమిది కుమ్కీ ఏనుగులను ఏపీకీ తెప్పిస్తున్నారు. మరోవైపు పీఎం మోదీ కూడా ప్రపంచ ఏనుగుల దినోత్సవం నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పెషల్గా ట్విట్ చేశారు. ఏనుగులు మన చరిత్ర సంస్కృతిలో అంతర్భాగమన్నారు.
ఏనుగుల సంఖ్య పెరిగేందుకు పాటుపడుతున్న వారందరికి ప్రత్యేకంగా మోదీ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 50,000 కంటే ఎక్కువగా ఆసియా ఏనుగులున్నాయని, అందుకు ఎక్కువ సంఖ్యలో.. భారత్ లో ఏనుగులున్నాయన్నారు. గత కొన్నేళ్లలో ఏనుగుల సంఖ్య భారీగా పెరిందని మోదీ అన్నారు. ఏనుగును మన సమాజంలో, వినాయకుడిగా, దైవంలా కొల్చుకుంటామని మోదీ అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter