World's Largest Fish whale shark: ప్రపంచంలోనే అతి పెద్ద చేపగా గుర్తింపు పొందిన వేల్ షార్క్(whale shark) విశాఖ తంతిడి తీరంలో సందడి చేసింది. దీనిని చూసేందుకు నగరవాసులు ఎగబడ్డారు. విశాఖ తంతిడి బీచ్(Thanthadi beach)లో మత్స్యకారులు(Fishermen) చేపల వేట సాగిస్తున్నారు. అంతలోనే అనుకోని అతిథి వారి వలకు చిక్కింది. అదే 50 అడుగులు పొడవు, 2 టన్నుల బరువు ఉన్న వేల్ షార్క్. దీంతో జాలర్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శ్రీకాంత్‌ మన్నెపూరి..అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని తెలియజేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో విశాఖ డీఎఫ్‌వో అనంత్‌ శంకర్‌ ఆదేశాల మేరకు సిబ్బంది వెంటనే తంతడి బీచ్‌కు చేరుకొని ఆ చేప ప్రపంచంలోనే అతిపెద్దదైన వేల్‌షార్క్‌(Whale Shark)గా నిర్ధారించారు. అంతరించిపోతున్న షార్క్‌ల జాతిలో ఇదొక్కటని అధికారులు పేర్కొన్నారు. షార్క్‌కు ఫిల్టర్‌ ఫీడింగ్‌ ఇచ్చి..అటవీ శాఖ అధికారులు, మత్స్యకారులు, వన్యప్రాణుల సంరక్షకులు షార్క్‌ను సురక్షితంగా సముద్రంలోకి పంపించారు అధికారులు. 2-టన్నుల చేప సజీవంగా సముద్రంలోకి తిరిగి వెళ్లింది. తమ ప్రయత్నాలు విజయవంతం అయ్యాయని సముద్రపు లోతుల్లోకి వెళ్లి.. స్వేచ్ఛగా షార్క్ ఈదుతోందని అధికారులు వెల్లడించారు.


Also Read: Video: బాయ్‌ఫ్రెండ్ కోసం పబ్లిక్‌లో కసితీరా కొట్టుకున్న వైజాగ్ గర్ల్స్...


వేల్ షార్క్‌లను వదిలిపెట్టేటప్పుడు..చేపల వలలకు ఏదైనా నష్టం జరిగితే పరిహారం ఇవ్వబడుతుంది అని అధికారులు తెలిపారు.పల వలలకు ఏదైనా నష్టం జరిగితే నష్టపరిహారం ఇవ్వబడుతుంది అని అధికారులు తెలిపారు. ఇటువంటి సంఘటనలలో నేరుగా రక్షించడానికి మరియు సురక్షితంగా విడుదల చేయడానికి అటవీ శాఖను సంప్రదించాలని కోరారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook