AP POLITICS: గోదావరి జిల్లాలో వైసీపీకి ఝలక్.. ఆ నేత కోసం చక్రం తిప్పిన లోకేష్!
Ys Jagan:ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి నేతల జంపింగ్‌లు జగన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఫ్యాన్ పార్టీ నుంచి రోజుకోనేత జంప్ అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది లీడర్లు పార్టీకి గుడ్ బై చెప్పారు.. ఈ జాబితాలోకి మరో లీడర్ చేరిపోయారు. గోదావరి జిల్లాలో నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాలను శాశించిన దొమ్మేరు జమీందార్ పెండ్యాల వెంకట కృష్ణారావు, అలియాస్ కృష్ణబాబు కుటుంబం వైసీపీకి గుడ్ బై చెప్పింది. మాజీ టీడీపీ ఎమ్మెల్యే కృష్ణబాబు అల్లుడు ప్రముఖ పారిశ్రామిక వేత్త రాజీవ్ కృష్ణ ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేసి ఫ్యాన్ పార్టీలో చేరిపోయారు.
Ys Jagan: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి నేతల జంపింగ్‌లు జగన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఫ్యాన్ పార్టీ నుంచి రోజుకోనేత జంప్ అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది లీడర్లు పార్టీకి గుడ్ బై చెప్పారు.. ఈ జాబితాలోకి గోదావరి జిల్లాల్లో కృష్ణబాబు వారసుడిగా రాజీవ్ కృష్ణ కొనసాగుతున్నారు. 2012 నుంచి వైసీపీలో కొనసాగుతున్న రాజీవ్ కృష్ణ.. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ సలహాదారుగా, అధికార ప్రతినిధిగా సేవలందించారు. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. జగన్ ముఖ్యమంత్రి పదవి కోల్పోవడంతో.. రాజీవ్ కృష్ణ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే కమ్మ సామాజికవర్గంపై జగన్ అనుసరిస్తున్న తీరుకు నిరసనగా దూరంగా ఉంటున్నట్టు సమచారం. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలకు టచ్‌లోకి వెళ్లిన ఆయన.. ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజీవ్ కృష్ణ జగన్ కు దూరం కావడం మాత్రం జగన్ పెద్ద దెబ్బనేని పార్టీ నేతలు అంటున్నారు.
వాస్తవానికి గోదావరి జిల్లాలో కృష్ణబాబు కుటుంబానికి మంచి పట్టుంది. కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో కృష్ణబాబు కుటుంబానిదే ఆధిపత్యం.. ఈ మూడు నియోజకవర్గాల్లో గెలుపు, ఓటములపై ఆయన కుటుంబం ఆర్థికంగానూ, సామాజికంగానూ అండగా నిలుస్తోంది. ఇక దొమ్మేరు జమీందారుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కృష్ణబాబు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో సీఎం చంద్రబాబు మంత్రి పదవి ఇస్తామని చెప్పినా ఆయన కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉండేందుకే ఆసక్తి చూపించారట. అయితే 2009 డిలిమిటెషన్‌లో కొవ్వూరు నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో ఆయన పోటీకి దూరంగా ఉండిపోయారు. ఆ తర్వాత కృష్ణబాబు కుటుంబం జగన్ పార్టీలో చేరిపోయింది. ఈ క్రమంలోనే కృష్ణబాబు వారసుడిగా ఆయన అల్లుడు రాజీవ్ కృష్ణ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.
ఇక వైసీపీలో కొత్తగా చేరిన రాజీవ్ కృష్ణకు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ నిడదవోలు టికెట్ కేటాయించారు. కానీ పాలిటిక్స్‌కు కొత్త కావడంతో రాజీవ్ కృష్ణ ఓటమి పాలయ్యారు. కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ప్రభుత్వ సలహాదారుగా కొనసాగారు. కానీ ఇటీవల రాజీవ్ కృష్ణకు గట్టి షాక్ తిగిలింది. ఆయన మామ, మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు అనారోగ్య కారణాలతో చనిపోయారు. అయితే కృష్ణబాబు మరణంతో.. రాజీవ్ కృష్ణ మనసు అధికార పార్టీ వైపు మళ్లింది. అటు టీడీపీ నుంచి కూడా పార్టీలోకి రావాలంటూ ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు రాజీవ్ కృష్ణ తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.
మొత్తంగా గోదావరి జిల్లాల్లో రాజీవ్ కృష్ణ పార్టీ మారడం వైసీపీ గట్టి దెబ్బే అన్న ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు పార్టీకి అన్ని విధాల అండగా ఉంటూ వస్తున్న రాజీవ్ కృష్ణ వెంట మరికొందరు లీడర్లు కూడా జంప్ అయ్యే అవకాశం ఉందని గోదావరి జిల్లాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది..