YS Jagan Sharmila: బర్త్ డేకు విష్ చేయని షర్మిల! వైఎస్ జగనన్న అంటే అంత కోపమా?

YS Sharmila Not Wishes To YS Jagan Birthday: ఒకప్పుడు విడదీయరాని వ్యక్తులుగా ఉన్నవాళ్లు ఇప్పుడు బద్ద శత్రువులుగా మారారు. కనీసం పుట్టినరోజుకు విష్ చేసుకోనంత వైఎస్ జగన్, షర్మిల ఆ జన్మ శత్రువులుగా మారడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
YS Jagan Birthday: రక్తం పంచుకుని పుట్టిన తోబుట్టువులు.. కష్టకాలంలో ఒకరినొకరు తోడుగా నిలిచారు. కానీ ఇప్పుడు బద్ద శత్రువులుగా మారారు. ఎంతలా అంటే పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు చెప్పుకోలేనంత ఆజన్మ శత్రువులుగా మారారు. వారే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైఎస్ షర్మిల. ఒకే నెలలో జన్మించిన ఈ అన్నా చెల్లెళ్లు వారి పుట్టినరోజులకు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోలేని పరిస్థితి. చెల్లి బర్త్‌డేకు అన్న.. అన్న పుట్టినరోజుకు చెల్లి శుభాకాంక్షలు చెప్పుకోలేదు. ఈ వార్త రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read: YS Sharmila: న్యూ ఈయర్‌కు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు.. వైఎస్ షర్మిల ప్రశ్నలు ఇవే!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం డిసెంబర్ 21వ తేదీ. వైఎస్ షర్మిల పుట్టిన తేదీ 17 డిసెంబర్. నాలుగు రోజుల వ్యవధిలో జన్మించిన అన్నాచెల్లెళ్లు ఎంతో ప్రేమగా ఉండేవారు. జగనన్న కష్టాలను తన కష్టాలుగా భావించి పార్టీని.. రాజకీయాలను భుజానకెత్తుకుని పని చేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి షర్మిల అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం వీరిద్దరూ రాజకీయంగానే కాదు కుటుంబపరంగా బద్ద శత్రువులుగా మారారు. ఆస్తుల పంచాయితీ ఈ అన్నాచెలెళ్లను విడగొట్టిన విషయం తెలిసిందే. ఈ పంచాయితీలో వారి తల్లి కూడా జగన్ నుంచి విడిపోయిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: Chandrababu: కబ్జారాయుళ్లకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. కబ్జా చేస్తే జైలుకే!
వైఎస్ కుటుంబంలో వచ్చిన ఆస్తుల లొల్లి తర్వాత వచ్చిన తొలి పుట్టిన రోజులకు పరస్పరం అన్నాచెల్లెళ్లు విష్ చేసుకోలేదు. వైఎస్ షర్మిల జన్మదినం సందర్భంగా జగన్ శుభాకాంక్షలు చెప్పకపోగా.. తాజాగా జగన్ పుట్టినరోజుకు షర్మిల నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్, షర్మిల మధ్య విభేదాలు రాజుకున్నాయి. ఆ తర్వాత తీవ్రమై ఈ ఏడాది ఒక్కసారిగా బట్టబయలు అయ్యాయి. ఇప్పుడు సొంత చెల్లి, తల్లిపైనే జగన్ న్యాయ పోరాటానికి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చిన పుట్టినరోజుల నాడు జగన్, షర్మిల పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోలేదు.
రాజకీయంగా.. కుటుంబపరంగా ఎన్ని భేదాభిప్రాయాలు.. కొట్లాటలు ఉన్నా కూడా శుభాకాంక్షలు చెప్పుకోవడం పరిపాటి. హుందాతనంతో జగన్, షర్మిల శుభాకాంక్షలు చెప్పుకుంటే మంచి పరిణామాలు ఉంటాయని భావించవచ్చు. ఆస్తుల లొల్లి ఉన్న సమయంలో విష్ చేసుకుంటే పెద్ద సమస్య కూడా చిన్నగా మారిపోయే అవకాశం ఉందని వైఎస్ కుటుంబ అభిమానులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook