Siddham Meeting: మీరు కృష్ణుడు.. నేను అర్జునుడిని.. కురుక్షేత్రానికి సిద్ధమా?: వైఎస్ జగన్
YS Jagan Siddham Meeting: ఎన్నికలకు కొన్ని రోజులే గడువు ఉండడంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీగా ప్రచారం చేస్తోంది. `సిద్ధం` పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభ మేదరమెట్లో నిర్వహించగా ప్రజల నుంచి ఊహించని స్పందన లభించింది. ఇక్కడ సీఎం జగన్ గర్జించారు.
Medarametla: మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు మద్దతు పలికేందుకు వచ్చిన ప్రజా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ తెలిపారు. సిద్ధం పేరుతో బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ కీలక ప్రసంగం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై విమర్శలు చేస్తూనే తన ప్రభుత్వం ఐదేళ్లలో ఏం చేసిందో చెప్పే ప్రయత్నం చేశారు. తాను అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే మరోసారి మన ప్రభుత్వం రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల కురుక్షేత్రంలో కృష్ణుడి పాత్ర మీది.. అర్జునుడి పాత్ర తనదిగా జగన్ చెప్పుకున్నారు. ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లు అంటూ పునరుద్ఘాటించారు.
Also Read: AP Politics: వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం.. ప్రతిపక్షాలకు షాక్.. జగన్‌కు బూస్ట్
'పేదల భవిష్యత్‌పై దాడి చేసేందుకు చంద్రబాబు అండ్ కో ఉంది. నోటాకు వచ్చినట్లు ఓట్లు కూడా రాని పార్టీలు చంద్రబాబుతో ఉన్నాయి. రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీసిన పార్టీలు బాబుతో ఉన్నాయి. మనతో నేరుగా తలపడే దమ్ము లేక ఢిల్లీకి వెళ్లి పొత్తులు పెట్టుకున్నారు' అని మూడు పార్టీల పొత్తులపై జగన్ విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై నేరుగా విమర్శలు చేశారు. మీ బిడ్డ పాలనతో ప్రతి ఇంట్లో చిరునవ్వు కనిపిస్తోందని తెలిపారు. పేదవాడి భవిష్యత్‌ను కాపాడేందుకు మీరంతా సిద్ధమా? అని ప్రశ్నించారు.
Also Read: Yousuf Pathan: రాజకీయాల్లోకి యూసుఫ్ పఠాన్.. మరి కాంగ్రెస్ అగ్ర నాయకుడికి చుక్కలు చూపిస్తాడా?
'ఇంటింటికి జగన్ చేసిన అభివృద్ధితో చంద్రబాబుకు భయం పుట్టిస్తోంది. జగన్ అంటేనే బాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మన ఎమ్మెల్యేలు అంతా గడపగడపకు తిరుగుతుంటే చంద్రబాబు మాత్రం ఢిల్లీలో ఇతర పార్టీల గడపలు తిరుగుతున్నారు. పార్టీల పొత్తులతో బాబు.. ప్రజలే బలంగా మనం తలపడుతున్నాం' అని విమర్శించారు. అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా తనకు లేదని, ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు అని స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter