YS Jagan Security: అధికారం కోల్పోయిన తర్వాత తన భద్రత తగ్గించారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన భద్రతను తగ్గించి చంద్రబాబు ప్రభుత్వం కుట్రకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. ఇదే అంశమై తాజాగా న్యాయ పోరాటానికి దిగారు. ఈ సందర్భంగా హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తనకు ముఖ్యమంత్రి హోదాలో భద్రత కల్పించాలని కోరడం విశేషం. 900 మందితో భద్రత కల్పించాలని డిమాండ్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Nara Lokesh: క్షమాపణలు చెప్పిన ఏపీ మంత్రి నారా లోకేశ్‌.. ఎందుకు ఏం తప్పు చేశారంటే?


 


'నాకు భద్రత పునరుద్దరించాలి. జూన్ 3వ తేదీ నాటికి 900 మందితో ఉన్న భద్రతను పునరుద్దరించాలి' అంటూ మాజీ సీఎం జగన్​ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేశారు. అయితే భద్రత తగ్గించారనే వాదనను ఏపీ పోలీసు శాఖ, ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి. నిబంధనల మేరకు జగన్‌కు భద్రత కేటాయించామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత కొనసాగుతుందని అధికారులు తేల్చి చెప్పారు.

Also Read: YSRCP MPs Resign: వైఎస్‌ జగన్‌కు భారీ షాక్‌.. త్వరలో ఆరుగురు ఎంపీల రాజీనామా?


 


ఈ సందర్భంగా జగన్‌ పిటిషన్‌పై పోలీస్‌ వర్గాలు గట్టి వాదనలు వినిపించాయి. జగన్‌ భద్రత కొనసాగుతోందని.. అయితే ముఖ్యమంత్రి హోదాలో అదనంగా కల్పించే భద్రత మాత్రమే తగ్గించినట్లు పోలీసు శాఖ వెల్లడించింది. ముఖ్యమంత్రి హోదా భద్రత ఇవ్వడం కుదరదని అధికారులు తేల్చిచెప్పారు. ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేకపోవడంతో నిబంధనల ప్రకారం భద్రత కల్పిస్తున్నట్లు అధికార వర్గాలు న్యాయస్థానానికి విన్నవించినట్లు సమాచారం.


సర్వత్రా విస్మయం
హైకోర్టులో జగన్‌ వేసిన పిటిషన్‌పై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అధికారం కోల్పోయినా కూడా ముఖ్యమంత్రి స్థాయిలో భద్రత కల్పించాలని కోరడం వింతగా ఉంది. ప్రస్తుతం జగన్‌ మాజీ ముఖ్యమంత్రి, కేవలం ఎమ్మెల్యే మాత్రమే. ప్రతిపక్షనేత హోదా కూడా లేకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి ఇచ్చిన భద్రత మాత్రమే కల్పిస్తున్నారు. ప్రస్తుతం జగన్‌ కాన్వాయ్‌లో రెండు అత్యాధునిక ల్యాండ్‌ క్రూయిజర్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లు ఉన్నాయి. 


సీఎంగా జగన్‌ భద్రత వ్యవస్థ ఇలా..
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్‌ జగన్‌కు భారీ బందోబస్తు ఉండేది. అత్యాధునిక రక్షణ పరికరాలు, తాడేపల్లిలోని నివాసం చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప గోడ కంచె ఉండేది. బుల్లెట్‌ ప్రూఫ్‌ క్రూయిజర్‌ వాహనాలు.. మూడు షిఫ్టుల్లో 986 మంది భద్రతా సిబ్బంది ఉండేవారు. అంటే ఒక్కో షిఫ్టులో 310 మంది ఉండేవారు. జగన్, ఆయన కుటుంబ సభ్యుల భద్రత కలిపితే ఒక చిన్న గ్రామ జనాభాతో సమానం. దేశంలో మరే ముఖ్యమంత్రికి లేని స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌ యాక్ట్‌ పేరుతో ప్రత్యేక చట్టమే తీసుకువచ్చారు. కమాండో తరహాలో స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమంత్రులందరి ఇళ్ల దగ్గర భద్రత కలిపినా అంత మంది ఉండకపోవచ్చు అనే చర్చ జరుగుతోంది. ఒక్క జగన్‌ భద్రతకే రూ.296 కోట్లు ఖర్చు చేశారని నేటి ప్రభుత్వం చెబుతోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook