YS Jagan Tweet: లోక్‌సభ ఎన్నికలతోపాటు శాసనసభకు జరిగిన ఎన్నికల ఫలితాలు జూన్‌ 4వ తేదీన విడుదల కానున్నాయి. ఫలితాల విడుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఫలితాల నేపథ్యంలో రాజకీయ నాయకులు మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తవుతుండగా.. పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. ఎవరికి వారు విజయంపై ధీమా వ్యక్తం చేస్తుండగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పూర్తి ధీమాతో ఉన్నారు. తాజాగా ఓ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌ను పరిశీలిస్తే మళ్లీ విజయం తనదేననంటూ చెప్పినట్లు కనిపిస్తోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chandrababu Naidu: వైసీపీకి వచ్చేవి 35 సీట్లే.. ఏపీలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే


వాస్తవంగా 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే స్థానాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందడంతో విభజిత ఏపీ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ ప్రమాణస్వీకారం చేసింది మే 30వ తేదీనే. ఈ సందర్భంగా ఐదేళ్ల కిందట తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయాన్ని జగన్‌ గుర్తుచేసుకున్నారు. అది గుర్తు చేస్తూ ఒక ట్వీట్‌ చేశారు.

Also Read: AP Election Results: ముంచుకొస్తున్న ఫలితాల సమయం.. జగన్‌, చంద్రబాబు, పవన్‌ ఏపీకి చేరుకునేదెప్పుడంటే..?


'దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల కిందట ఇదే రోజున మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది' అని జగన్‌ 'ఎక్స్‌'లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా తాను ప్రమాణస్వీకారం చేస్తున్న ఫొటోను కూడా జగన్‌ పంచుకున్నారు.


ఐదేళ్లు అన్ని వర్గాలకు మంచి చేశామని చెబుతూనే మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం అని చెప్పడం చూస్తుంటే జగన్‌ ఎన్నికల్లో విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. రెండోసారి కూడా తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి గత ఐదేళ్లు కొనసాగించిన పథకాలనే కొనసాగిస్తామని చెప్పడం అంటే తన విజయం ఖాయమనే పూర్తి భావనలో ఉన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదని తన పోస్టు ద్వారా స్పష్టం చేశారు.



 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter