ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సర్కారు సంక్షేమంపై ఫోకస్ చేస్తోంది. కరోనా వ్యాప్తి సమయంలోనూ బలహీనవర్గాలకు, ఆర్థికంగా వెనుబడిన పలు వర్గాలకు కొత్త పథకాల ద్వారా సంక్షేమ పథకాలు అమలయ్యేలా చేస్తున్నారు. మరోవైపు మద్యం మహమ్మారిపై ఏపీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని తెలిసిందే. దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని.. ద‌క్షిణాదిన అతి చిన్న రాష్ట్రం కేర‌ళ‌లో కన్నా మ‌ద్యం వినియోగం ఏపీలోనే తక్కువ అని (Liquor Policy in AP) వైఎస్సార్‌సీపీ తమ ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. Nithiin: ప్రభాస్ బాటలో నితిన్.. దర్శకుడికి నితిన్ ఖరీదైన గిఫ్ట్



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతేడాదితో పోల్చితే 2020లో 65 శాతం వరకు మద్యం వినియోగం ఏపీలో తగ్గింది. 2019 ఏప్రిల్ - ఆగస్టు మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వానికి రూ.7,638.24 కోట్లు ఆదాయం సమకూరగా.. ఈ ఏడాది అదే సమయంలో రూ.5,468.17 కోట్లు వచ్చింది. గతేడాది కన్నా రూ.2,170.07 కోట్ల ఆదాయాన్ని ఏపీ ప్రభుత్వం కోల్పోయింది. ఏపీలో మద్యం షాపులు తగ్గించడం, మద్యం విక్రయాలపై కఠిన నిర్ణయాలు అమలు చేయడంతో ఏపీ ప్రభుత్వం ఫలితాలను రాబట్టగలిగింది.  Bigg Boss 4: అరియానా గ్లోరి ఫొటోలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR