న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన సుమారు గంటపాటు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లోక్ సభ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన నరేంద్ర మోదీకి జగన్ అభినందనలు తెలియజేయగా.. ఏపీ ఎన్నికల్లో విజయం సొంతం చేసుకున్న జగన్‌ని మోదీ అభినందించారు. తన ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కావాల్సిందిగా మోదీని వైఎస్ జగన్ కోరినట్టు సమాచారం. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎదుర్కుంటున్న సమస్యలను మోదీ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"178547","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ముఖ్యంగా రాష్ట్రం ఎదుర్కుంటున్న ఆర్థిక ఇబ్బందులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు అదనపు నిధులు వంటి అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఎల్వీ సుబ్రహ్మణ్యం సహా 9 మంది పార్టీ ఎంపీలు జగన్‌తోపాటు మోదీని కలిసిన వారిలో ఉన్నారు.


[[{"fid":"178548","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
ప్రధాని మోదీని కలిసిన అనంతరం అక్కడి నుంచి నేరుగా ఏపీ భవన్ కి వెళ్లి అక్కడి అధికారులతో సమావేశం కానున్నారు.