YS Jagan Mohan Reddy: ఏపీ మాజీ ముఖ్యమంత్రి..వైయస్ఆర్సీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమిలో చేరడం  ఆ  ఇద్దరు నేతలకు మాత్రం పెద్దగా ఇష్టం లేదట. జగన్ కూటమిలో చేరడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. ఇంతకీ జగన్ ను అంతలా వ్యతిరేకిస్తున్న ఆ ఇద్దరు ఎవరు..? అసలు వారికి జగన్ కు ఎందుకు చెడిందనే విషయం ఇపుడు ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల తర్వాత వైఎస్సార్పీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆలోచన మారినట్లు కనిపిస్తుంది. ఏపీలో అధికారంలో ఉండగా కేంద్రంలో ఉన్న బీజేపీకీ బయట నుంచి మద్దతు ప్రకటించారు. ప్రధానీ నరేంద్ర మోడీతో  సత్సంబంధాలు జగన్ మోహన్ రెడ్డి నడిపించారు. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి బీజేపీ టీడీపీతో జత కట్టడం . విజయం సాధించడంతో  బీజేపీకీ జగన్ కు కొంత గ్యాప్ వచ్చినట్లు స్పష్టమవుతుంది. మూడో సారి అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా బీజేపీ జగన్ తో కొంత సానుకూలంగా ఉన్నట్లు కనిపించింది. స్పీకర్ ఎన్నికల సమయంలో బీజేపీ జగన్ మద్దత కోరడం, జగన్ కు కూడా బేషరుతుగా మద్దతు ఇవ్వడం  చకాచకా అయిపోయాయి. ఈ పరిణామాలతో ఆ రెండు పార్టీల మధ్య మంచి సంబంధాలే ఉన్నట్లు కనిపించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే సమయంలో ఏపీలో వైసీపీ కార్యకర్తలపై జరగుతున్న దాడులపై ఫిర్యాదు చేసేందుకు జగన్ నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ కోరినట్లు తెలిసింది. ప్రధానితో ఏపీలో నెలకొన్ని పరిస్థితులను వివరించాలనుకున్న జగన్ కు నిరాశే మిగిలింది. జగన్ కు ప్రధాని అపాయింట్ మెంట్ దక్కకపోవడంతో వైసీపీనీ ఆలోచనలో పడేసింది. ఇన్ని రోజులు కేంద్రంలో ఉన్న బీజేపీకీ, ప్రధానీ మోడీకీ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించినా తమను పట్టించుకోకపోవడంపై జగన్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలిసింది.  మేము రాజకీయంగా చాలా ఫేర్ గా ఉండి బీజేపీకీ బయట నుంచి మద్దతు ప్రకటిస్తే బీజేపీ మాత్రం తమను పట్టించుకోకపోవడంతో జగన్ ఒకింత అసహనంతో ఉన్నట్లు తెలిసింది. ఇంత జరిగినా బీజేపీనీ నమ్ముకొని ఉంటే రాజకీయంగా తమకు ఇబ్బందులు వస్తాయనే ఆలోచనలో వైసీపీ వర్గాలు ఉన్నాయి.


బీజేపీ ధోరణితో భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ వ్యూహాలు అమలు చేయాలి అన్న కోణంలో సన్నిహిత వర్గాలతో సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. ఒక వైపు ఏపీలో రోజు రోజుకు పార్టీ పరిస్థితి ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళుతుంది. ఇలాంటి తరుణంలో ఇతర పార్టీల మద్దతు తప్పనిసరి అయ్యింది. దీంతో భవిష్యత్తు అడుగులు ఎటు వేయాలా అన్న సందిగ్ధంలో జగన్ ఉన్నారు. బీజేపీకీ ఆల్టర్ నేట్ గా కాంగ్రెస్ ఒక్కటే కనిపిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బీజేపీతో సమానంగా ఎన్నికల్లో రాణించింది. గత రెండు దఫాలుగా కేంద్రంలో బయట పార్టీల నుంచి మద్దతు లేకుండా ఏకపక్షంగా అధికారం చెలాయించిన బీజేపీకీ ఈ సారి ఇండియా కూటమి కాస్తంత బ్రేకులు వేసింది. గతంలో లాగా మోడీ, బీజేపీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండే అవకాశం కనపడడం లేదు. అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా ఎన్డీయేను గట్టిగా నిలదీస్తున్నాయి. ఈ రాజకీయ పరిణామాలే జగన్ ను ఇండియా కూటమి వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయని రాజకీయా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


మొన్న ఢిల్లీ జగన్ తలపెట్టిని ధర్నాలో కాంగ్రెస్ మినహా మిగితా ఇండియా కూటమి పక్షాలు హాజరుకావడం దానికి బలం చేకూర్చేలా కనపడుతున్నాయి. మరోవైపు జగన్.. ఏపీలో టీడీపీ, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి అంతా ఒకటే అని చెబుతున్నారు. కానీ లో లోన మాత్రం ఇండియా కూటమితో జత కట్టాలనే యోజనలో ఉన్నారు. ఏపీలో టీడీపీ కూటమిని రాజకీయంగా తట్టుకోవాలంటే ఇండియా కూటమి మద్దతు అనివార్యంగా జగన్ భావిస్తున్నారు. వీలైనంత త్వరలో ఇండియా కూటమిలో చేరడానికి జగన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఎలాగో బీజేపీనీ అతిగా నమ్ముకొని మోసం పోయాం. బీజేపీ విషయంలో మనం సానుకూలంగా ఉన్నా , బీజేపీ పెద్దలు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ కు మద్దతుగా నిలవడం అనుమానంగా మారింది. దీంతో ఇండియా కూటమిలోకి వెళ్లడమే జగన్ ముందు ఉన్న ఆప్షన్ గా కనిపిస్తుంది.


ఇండియా కూటమిలో ఉన్న ప్రధాన పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ కు జగన్ కు మధ్య తీవ్ర అగాథం ఉంది. రాజకీయంగా రెండు పార్టీల మధ్య వైరం. రెండు పార్టీల మధ్య భావ సారూప్యత ఉన్నా గతంలో జరిగిన రాజకీయ పరిణామాలు ఇద్దరి మధ్య పూడ్చలేని అగాధాన్ని సృష్టించాయి. అలాంటి వాటిని సైతం జగన్ పక్కన పెట్టేందుకు సిద్దపడుతున్నట్లు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది నానుడి. అది జగన్ విషయంలో కూడా నిజం కాబోతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ తో ఉన్న విభేధాలను పక్కన పెట్టేందుకు జగన్ సిద్దపడినట్లు తెలిసింది.


దీని కోసం కాంగ్రెస్ లోని కొందరు జగన్ సన్నిహితులు సహకరిస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరగుతుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా జగన్ విషయంలో కొంత చూసీ చూడనట్లు వ్యవహరించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఏపీలో బలపడాలంటే జగన్ మద్దతు అవసరమని కాంగ్రెస్ భావిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ అండగా ఉంటే ఏపీలో రాజకీయంగా ఏర్పడే ఇబ్బందులను అధిగమించవచ్చనే ఆలోచనలో జగన్ ఉన్నారు. ఇలా ఒకరికి మరొకరి అవసరం ఏర్పడుతుండడంతో ఇరు పార్టీలు ఒక అండర్ స్టాండింగ్ వచ్చేలా సూచనలు కనిపిస్తున్నాయి.మొన్న ఢిల్లీలో జగన్ కు మద్దతు తెలిపిన పార్టీలు కూడా ఇండియా కూటమిలోకి రావాలని కోరినట్లు తెలిసింది. మాకు కాంగ్రెస్ తో కొన్ని అంశాల్లో విభేధాలు ఉన్నా బీజేపీనీ ఎదుర్కోవడానికి కలిసి పోరాడుతున్నాం. వైసీపీ కూడా కూటమిలో రావడానికి ఆలోచించండి అని పార్టీలు చెప్పినట్లు తెలిసింది. జగన్ కూడా ఇండియా కూటమి చెప్పిన విషయాలపై తీవ్రంగా ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమిలోకి చేరుతేనే బాగుంటుందని భావిస్తున్నారు.


ఇంత వరకు బాగానే ఉన్నా...ఇద్దరు మాత్రం జగన్ ఇండియా కూటమిలో చేరడానికి అడ్డుపడేలా కనిపిస్తున్నారు. జగన్ ఇండియా కూటమిలో చేరడానికి ఒక వైపు ప్రయత్నాలు కొనసాగిస్తుంటే ఆ ఇద్దరికి పెద్దగా ఇష్టం లేనట్టుగా కనిపిస్తుంది. అందులో ఒకరు స్వయాన జగన్ మోహన్ రెడ్డి సోదరి , ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాగా మరొకరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరికి జగన్ ఇండియా కూటమిలో చేరడం పెద్దగా  ఇష్టపడడం లేదని తెలుస్తుంది. అన్నయ్య జగన్ తో రాజకీయంగా విభేదించి కాంగ్రెస్ లో చేరిన షర్మిల గత కొద్ది రోజులుగా జగన్ ను రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా తీవ్రంగా విభేదిస్తూ వస్తుంది. ఇలాంటి తరుణంలో జగన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమిలో చేరితే తన పరిస్థితి ఏంటనే ఆలోచన షర్మిలలో కనపడుతుంది. మళ్లీ జగన్  రాజకీయంగా బలపడితే దాని ప్రభావం తన మీద కూడా ఉంటుందని. అందులోను తాను అధ్యక్షురాలిగా ఉన్న పార్టీయే జగన్ కు మద్దతు ప్రకటిస్తే భవిష్యత్తులో పార్టీ ఆధ్వర్యంలో జరగబోమే కార్యక్రమాలకు జగన్ తో వేదిక పంచుకోవాల్సి వస్తుంది.అది షర్మిలకు బొత్తిగా ఇష్టం లేదని తెలుస్తుంది. వీలైనంత వరకు జగన్ ఇండియా కూటమిలోకి రాకుండా అడ్డుకోవాలన్నదే షర్మిల ఆలోచనగా తెలుస్తుంది. ఒక వేళ జగన్ ఇండియా కూటమిలో చేరేందుకు సిద్దపడితే అప్పుడు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో ఇప్పటి నుంచే షర్మిల కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.


మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా జగన్ ఇండియా కూటమిలో చేరడం పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్లు తెలుస్తుంది. మొదటి నుంచి రేవంత్ రెడ్డి, జగన్ కు రాజకీయంగా ఇద్దరి మధ్య సంబంధాలు అంతంత మాత్రమే. తెలంగాణలో తన బద్ద శత్రువైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగన్ అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డికి మింగుడుపడని అంశం. అదే సమయంలో ఏపీలో తన ప్రధాన రాజకీయ విరోధి ఐన చంద్రబాబుకు రేవంత్ రెడ్డి శిష్యుడిగా పేరుంది. ఇది జగన్ కు రేవంత్ రెడ్డి మధ్య సంబంధాలు అంతంత మాత్రమే ఉండేలా చేశాయి. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామల్లో రేవంత్ రెడ్డికి ఢిల్లీ అధిష్టానంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఏదైనా కీలక రాజకీయ నిర్ణయాల్లో రేవంత్ రెడ్డి అభిప్రాయం కూడా అధిష్టానం తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఒక వేళ భవిష్యత్తులో జగన్ ఇండియా కూటమిలో చేరదలుచుకుంటే రేవంత్ రెడ్డి అంతగా సానుకూలంగా ఉండకపోవచ్చనేది రాజకీయవర్గాల్లో చర్చ జరగుతోంది. దీని దృవపరిచేలా జగన్ మోహన్ రెడ్డి తాజాగా రేవంత్ పైన చేసిన కామెంట్స్ ఉన్నాయి.


ఇలా ఇద్దరు నేతలు జగన్ ఇండియా కూటమిలో చేరాలనుకుంటే అడ్డుపడే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాల నేపథ్యంలో జగన్ ఇండియా కూటమిలో చేరేందుకు సిద్దపడితే ఈ ఇద్దరు నేతలు ఏం చేస్తారు...జగన్ కూటమిలో చేరడాన్ని అడ్డుపడుతారా లేకా అధిష్టానం ఆలోచనలకు అనుగుణంగా జగన్ కూటమిలో చేరడానికి ఒప్పుకుంటారా అనేది వేచి చూడాలి.


ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..


ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter