YS Jagan Pooja: తిరుపతి లడ్డూ లొల్లిపై రంగంలోకి వైఎస్ జగన్.. శనివారం మాజీ సీఎం దీక్ష?
తిరుమల పవిత్రతపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న కుట్రపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్షతో తిరుమల వివాదాన్ని మరింత ఉధృతం చేయడంతో వైఎస్సార్‌సీపీపై చెడ్డ పేరు వస్తుందని గ్రహించిన వైఎస్ జగన్ పూజలు చేపట్టనున్నారు. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు శనివారం రోజు పూజలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు `ఎక్స్` వేదికగా ఆయన కీలక ప్రకటన చేశారు.
YS Jagan Mohan Reddy Deeksha: తిరుమల పవిత్రతపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న కుట్రపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్షతో తిరుమల వివాదాన్ని మరింత ఉధృతం చేయడంతో వైఎస్సార్‌సీపీపై చెడ్డ పేరు వస్తుందని గ్రహించిన వైఎస్ జగన్ పూజలు చేపట్టనున్నారు. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు శనివారం రోజు పూజలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ఆయన కీలక ప్రకటన చేశారు.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ దీక్షల వెనుక పెద్ద వ్యూహమే ఉందా, తెరవెనుక ఏం జరుగుతోంది
'తిరుమల పవిత్రత.. స్వామివారి ప్రసాదం విశిష్టత.. వెంకటేశ్వరస్వామి వైభవాన్ని.. టీటీడీ పేరు ప్రఖ్యాతులను.. వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రత.. రాజకీయ దుర్బుద్ధితో.. కావాలని అబద్ధాలాడారు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. 'జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా.. ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా.. అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబర్ 28 శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని వైఎస్సార్‌సీపీ పిలుపునిస్తోంది' అని ప్రకటించారు.
Also Read: R Krishnaiah: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు భారీ షాక్.. పిలిచి ఎంపీ పదవి ఇస్తే రాజీనామా
తిరుమల పవిత్రతపై ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర రాజకీయ రచ్చ నడుస్తోంది. ఈ వ్యవహారంపై టీడీపీ, బీజేపీ, జనసేన వర్సెస్ వైఎస్సార్‌సీపీ మధ్య తీవ్ర విమర్శలు కొనసాగుతున్నాయి. విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చిన కూడా వివాదం చల్లారకపోవడంతో సీఎం జగన్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. అయితే శనివారం రోజున వైఎస్ జగన్ కూడా పూజల్లో పాల్గొంటారని సమాచారం. అయితే ఎక్కడ పాల్గొంటారనేది ఇంకా నిర్ణయించలేదని సమాచారం. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అసత్య ఆరోపణలు.. తిరుమలను రాజకీయం చేయడంపై తీవ్రస్థాయిలో తిప్పికొట్టేందుకు వైఎస్సార్‌సీపీ సరికొత్తగా పూజలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter