YS Jagan: అధికారం కోల్పోయిన తర్వాత  వైఎస్సార్‌ సీపీ నాయకులకు సంబంధించిన కుటుంబ విషయాలు కలకలం రేపుతున్నాయి. కుటుంబ గొడవలు.. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు వెలుగులోకి వస్తుండడంతో ఆ పార్టీకి తీవ్ర చెడ్డ పేరు వస్తోంది. అధికారంలో ఉన్నప్పుడే ఎంపీతోపాటు ఇతర ప్రజాప్రతినిధుల రాసలీలలు బయటపడ్డాయి. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ నాయకులకు సంబంధించిన మరిన్ని విషయాలు తెరపైకి వస్తున్నాయి. వాటిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది. అయితే వారి కుటుంబ వ్యవహారాల అంశం పార్టీకి చేటు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chandrababu: నెక్ట్స్‌ టార్గెట్‌ కొడాలి నాని.. చంద్రబాబు గుడివాడ పర్యటనపై ఉత్కంఠ

ఈ క్రమంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అక్రమ సంబంధంతో పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉందనే ఉద్దేశంతో దువ్వాడ శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని జగన్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది. జగన్‌ ఆదేశాలతో త్వరలోనే అతడు శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: Kadapa Airport: ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌.. ఎక్కడికైనా కడప నుంచి నిమిషాల్లో జర్నీ


కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారం వైఎస్సార్‌సీపీకి అప్రతిష్ట చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. గతంలో రాజ్యసభ సభ్యుడు, ఇతర మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై కూడా ఇలాంటి లైంగిక ఆరోపణలు వచ్చాయి. పార్టీపై తీవ్ర ప్రభావం పడకముందే జగన్‌ నష్ట నివారణ చర్యలు దిగినట్లు సమాచారం. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని జగన్‌ ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి.


అయితే పార్టీ అధినేత ఆదేశాలకు అనుగుణంగా రెండు, మూడు రోజుల్లో దువ్వాడ శ్రీనివాస్‌ రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ శ్రీనివాస్‌ ససేమిరా అంటే.. అతడి వివాదం మరింత ముదిరితే మాత్రం పార్టీ నుంచి సస్పెండ్‌ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. విజయసాయి రెడ్డి, ద్వారంపూడి ఘటనలు కూడా పార్టీపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో మొదట దువ్వాడ శ్రీనివాస్‌ నుంచి దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter