లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు  వైఎస్ జగన్ అండగా నిలిచారు. వర్మ ప్రెస్ మీట్ ను అడ్డుకోవడాన్ని తప్పబట్టిన వైఎస్ జగన్...  వర్మ చేసిన తప్పేంటని చంద్రబాబుకు సూటి  ప్రశ్న వేశారు.  విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని  పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది.  పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం..! అంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న విజయవాడలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని జగన్ ఈ మేరకు కామెంట్ చేశారు



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఆదివారం రోజు లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ సంబంధించిన  ప్రెస్ మీట్ పెడుతునందుకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మను విజయవాడ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆయన్ను అదుపులో తీసుకున్నారు. రామ్ గోపాల్ వర్మతో పాటు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి, యూనిట్ సభ్యులందరితో బలవంతంగా హోటల్ గదులను ఖాళీ చేయించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని గన్నవరం విమానాశ్రయంలో వదిలేశారు. వెంటనే విజయవాడను వదిలి వెళ్లాలంటూ ఆదేశించారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని జగన్ ఈ మేరకు స్పందించారు.