YS JAGAN vs SHARMILA :జగన్, షర్మిల ఆస్తుల పంచాయితీ గత పది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఒకప్పుడు ఎంతో ప్రేమగా ఉన్న ఈ అన్నా చెల్లెలి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. ఒకప్పుడు తన అన్న జగన్ ను ఎవరైనా పల్లెత్తు మాట అన్నా వారిపై షర్మిల విరుచుకుపడేది. అలాంటి షర్మిల ఇప్పుడు అందరి కన్నా ఎక్కువగా జగన్ పై విరుచుకుపడుతుంది. దీనికి అంతటికి కారణం జగన్ ,షర్మిల మధ్య ఆస్తుల పంచాయితీయే కారణమని అందరూ భావిస్తున్నారు. అందుకు తగినట్టుగానే గత వారం రోజులుగా షర్మిల విడుదల చేస్తున్న లేఖలు, ఆమె మీడియాతో మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అర్థం అవుతుంది. దీనికి అనుగుణంగా వైఎస్  విజయమ్మ కూడా షర్మిలకు అండగా  నిలవడంతో ఇదంగా ఆస్తుల పంచాయితీ అనుకుంటున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

న్యాయంగా తనకు రావాల్సిన వాటాను జగన్ ఇవ్వడం లేదని షర్మిల ఆరోపణ. వైఎస్ విజయమ్మ కూడా ఇదే విషయం ప్రస్తావిస్తూ లేఖ విడుదల చేసింది.ఇలా ఆస్తుల పంచాయితీపై ఎవరికి తగ్గట్టుగా వారు వాదనలు వినిపిస్తున్నారు. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత ఆస్తుల విషయంలో ఏకంగా ఎన్సీఎల్ కోర్టును ఆశ్రయించడం పెను సంచలనంగా మారింది. తల్లి, చెల్లిపై జగన్ కోర్టుకు వెళ్లడంపై తీవ్ర దుమారం రేపింది. ఈ విషయంలో  జగన్ పై  ప్రత్యర్థి పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయంగా తల్లిని. చెల్లిని వాడుకున్న జగన్ తన అవసరం తీరాకా ఇప్పుడు కోర్టుకు వెళ్లాడని మండిపడ్డారు. 


ఇది  ఇలా ఉండగానే ఇటు షర్మిల, అటు విజయమ్మ లేఖలపై వైసీపీ కూడా గట్టిగానే తన వాదన వినిపిస్తుంది. షర్మిలకు ఇవ్వాల్సిన దాని కన్నా ఎక్కువనే ఇచ్చారని వైసీపీ నేతలు చెబుతున్నారు. చెల్లిపై ప్రేమతో  జగన్ ఆస్తులను రాసిసిస్తే అత్యాశకు పోయి మరింత కావాలని షర్మిల కావాలనే రాజకీయ రచ్చ చేస్తుందని వైసీపీ విమర్శిస్తుంది. జగన్ ను రాజకీయంగా బలహీనం చేసే కుట్రలో భాగంగా షర్మిల ఇదంతా చేస్తుందనేది వైసీపీ ఆరోపణ. అయితే ఇదే క్రమంలో వైసీపీ వర్గాల్లో తాజాగా ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. అందరూ అనుకుంటున్నట్లుగా జగన్ షర్మిల మధ్య ఉంది ఆస్తుల వివాదం కాదని అంతకు మించి ఉందని అది ఇటీవలే తమకు తెలిసిందని వైసీపీకీ చెందిన కొందరు కీలక నేతలు అంటున్నారు. 


ఇంతకీ జగన్ షర్మిల మధ్య వివాదం చెలరేగడానికి కారణాలేంటి అని వైసీపీ వర్గాలను అడిగితే ఒక కొత్త విషయాన్ని బయటపెట్టారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం ఐన తర్వాత  షర్మిల తన అన్న ముందు ఒక కీలక ప్రతిపాదన పెట్టిందంట. ఆ ప్రతిపాదన విని జగన్ ఒక్క సారిగా షాక్ అయ్యాడట. ఇంతకీ జగన్ ను అంతలా షాక్ గురి చేసిన అంశం ఏంటంటే  జగన్ ప్రభుత్వంలో ఒక కీలక పదవి అడిగిందంట దానికి జగన్ ఏమాత్రం సంకోచం లేకుండా ఇవ్వడం కుదరదు అని షర్మిలకు తేల్చి చెప్పాడని వైసీపీ వర్గాల భోగట్టా. షర్మిల ఆలోచనలను గమనించిన జగన్ నీకు ఆస్తులు ఇస్తాను, నువ్వు రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారని వైసీపీ వర్గాలు చెబతున్నాయి. అన్న మాటలకు నొచ్చుకున్న షర్మిల జగన్ కు దూరంగా ఉండడం మొదలు పెట్టిందట. ఇక అప్పటి నుంచి  జగన్ పై క్రమక్రమంగా రగిలిపోతున్న షర్మిల తనను రాజకీయాల్లో దూరంగా ఉండమని చెప్పిన అన్నకు అదే రాజకీయాలతో  ఇబ్బందులకు గురి చేస్తుంది.


ఐతే షర్మిల జగన్ ను అడిగిన ఆ పదవి ఏంటి..జగన్ ను అంతలా షాక్ గురి ఎందుకు అయ్యాడనేదానికీ వైసీపీ నేతలు చెబుతున్నది ఏంటంటే..జగన్ తో సమానంగా షర్మిల 2019లో డిప్యూటీ సీఎం అడిగిందంట. దీంతో జగన్ సీరియస్ అయ్యాడట. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు కీలక నేతలు కీలక పదవుల్లో ఉంటే తప్పుడు సంకేతాలు వెళుతాయని జగన్ చెప్పాడట. ఈ రాజకీయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అనవసరంగా నీకెందుకు ఈ తలనొప్పులు అని షర్మిలకు జగన్ హితభోద చేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. షర్మిల రాజకీయ ఆకాంక్షలకు జగన్ అడ్డుపడుతున్నాడని షర్మిల ఈ విధంగా చేసిందని వైసీపీ అంటోంది.


ఇలా మొత్తానికి డిప్యూటీ సీఎం పదవి జగన్ షర్మిల పంచాయితీ పెట్టిందని వైసీపీ నేతల భావన. అందుకే రాజకీయ పదవి దక్కకపోవడంతో అదే రాజీకీయాలతో జగన్ ను ఇరుకునపెడుతుందని వారి అంచనా.మరీ వైసీపీ చేస్తున్న ఈ సంచలన ఆరోపణల వెనుక ఉన్న నిజం ఎంత....? 
దీనిపై షర్మిల స్పందిస్తే కానీ తెలియదు. 


Also Read: Rahu Mahadasha: రాహు మహాదశ ఈ రాశికి 18 ఏళ్లు రాజభోగాలు.. లక్షాధికారి అయ్యే బంపర్‌ ఛాన్స్‌!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.