పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు
పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య పుట్టిన రోజు కేక్ కట్ చేసిన వైఎస్ జగన్
టెక్కలి: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో వున్న జగన్.. టెక్కలి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్ చేసి వారి నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు. వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు. వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, ఎచ్చెర్ల సమన్వయకర్త గొర్లె కిరణ్ కుమార్, పలాస సమన్వయకర్త సీదిరి అప్పలరాజు, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు వి కళావతి, కంబాల జోగులు వంటి నేతలు జగన్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.