వైఎస్ జగన్ నేటి ఎన్నికల ప్రచారం షెడ్యూల్

వైఎస్ జగన్ నేటి ఎన్నికల ప్రచారం షెడ్యూల్
విజయవాడ: ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు మరో వారం రోజులే గడువు మిగిలి వుండటంతో ఎన్నికల ప్రచారంలో వేగం పెంచుతూ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నేడు గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జగన్ నేటి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఆయన ఉదయం 9.30కి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో పర్యటించిన అనంతరం 11.30కి గురజాలలో ఎన్నికల ప్రచారం ర్యాలీలో పాల్గొని ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1.30కి ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రచారం నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 3.30కి కృష్ణా జిల్లా మైలవరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనాన్ని ఎగరవేసి ఎలాగైనా ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని వైఎస్ జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జగన్ గెలుపు కోసం ఆ పార్టీ నేతలు సైతం తీవ్ర కృషిచేస్తున్నారు.