Fee Reimbursement: కన్న కొడుకై ఉండీ కూడా తన తండ్రి వైఎస్సార్‌ అమలుచేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని వైఎస్‌ జగన్‌ నిర్వీర్యం చేశారని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ చేసింది మహాపాపమని.. చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే తీరున వ్యవహరిస్తుండడంతో అది విద్యార్థులకు శాపంగా మారిందని వాపోయారు. వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YS Jagan: 'దిశా' లేని చంద్రబాబు ఇదేమి రాజ్యం? అత్యాచారాలపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం


ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పేరుకుపోయానని.. వెంటనే నిధులు విడుదల చేయాలని వైఎస్‌ షర్మిల కోరారు. ఈ విషయమై ట్విటర్‌ వేదికగా ఓ కీలకమైన పోస్టు చేశారు. 'వైఎస్‌ఆర్‌ మానస పుత్రిక, కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ప్రతిష్ఠాత్మక పథకం ఫీజు రీయింబర్సమెంట్‌. పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి, ఎంతో మంది ఇంజనీర్లు, డాక్టర్లను తయారు చేసిన గొప్ప పథకం' అని షర్మిల వివరించారు.

Also Read: Pithapuram: జనసేనాని మాటంటే శాసనమే! చిన్నారుల దాహార్తి తీర్చిన డిప్యూటీ సీఎం


'ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వైఎస్సార్‌ అద్భుతంగా అమలు చేస్తే.. సొంత కొడుకై ఉండి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి తన హయాంలో పథకాన్ని నీరు గార్చారు' అని షర్మిల ఆరోపించారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు రూ.3,500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటు అని మండిపడ్డారు. బకాయిలు చెల్లించకుండా వారి జీవితాలతో చెలగాటమాడారని తల్లిదండ్రులను మనోవేదనకు గురి చేశారని వాపోయారు. దోచుకొని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ, విద్యార్థుల సంక్షేమం మీద పెట్టలేదని మాజీ సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు.


'వైఎస్సార్‌ తన జీవితం మొత్తం మత పిచ్చి బీజేపీనీ వ్యతిరేకిస్తే.. అదే బీజేపీకి వైఎస్‌ జగన్ దత్తపుత్రుడు. బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగిన మోడీ వారసుడు జగన్. అలాంటి వారికి వైఎస్సార్‌ ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడ.. ఆశయాలకు వారసులు అవుతారనడం పొరపాటు' అని వైఎస్‌ షర్మిల వివరించారు. 'కూటమి ప్రభుత్వం కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. వైసీపీ చేసింది మహా పాపమైతే.. కూటమి సర్కారు విద్యార్థులకు పెడుతున్నది శాపం' అని షర్మిల వాపోయారు.


'ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఎవరు పెండింగ్ పెట్టినా.. అవి రిలీజ్ చేసే బాధ్యత ఇప్పుడు సీఎం చంద్రబాబుపై ఉంది' అని వైఎస్‌ షర్మిల తెలిపారు. వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పథకానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter