YS JAGAN vs SHARMILA : వైఎస్ మరణం తర్వాత జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి అనేక కష్టాలు ఎదురయ్యాయి. తండ్రి మరణం తర్వాత జగన్ ఓదార్పు యాత్ర పేరుతో జనంలోకి వెళ్లాడు. ఇది కాంగ్రెస్ అధిష్టానికి ఏమాత్రం రుచించలేదు. వైఎస్ జగన్ ను కంట్రోల్ లో పెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ జగన్ అవేమీ లెక్క చేయలేదు. తాను ఇచ్చిన మాట ప్రకారం ఓదార్పు యాత్ర చేసి తీరుతా ని డిసైడ్ అయ్యారు. దానిలో భాగంగా కాంగ్రెస్ కు కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలం ఓదార్పుతో జగన్ జనాల్లో ఉన్నారు ఇదే సమయంలో అక్రమ ఆస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లాల్సిన పరిస్తితి వచ్చింది. ఈ సమయంలో ఒక వైపు చెల్లెలు షర్మిల తన అన్న జగన్ కు అండగా నిలిచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత జగన్ కు వైసీపీనీ స్థాపించడం దానికి షర్మిల, తల్లి విజయమ్మ కూడా పూర్తి స్థాయిలో మద్దతుగా నిలవడమే కాకుండా జగన్ కు అండగా నిలిచారు.ఇదే సమయంలో రాష్ట్ర విభజన కూడా జరిగింది. ఉమ్మడి రాష్ట్రం ఆంధ్ర, తెలంగాణలుగా విడిపోయింది. విభజిత ఏపీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆంధ్రాలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ 67 స్థానాల్లో  గెలుపొంది ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది. జగన్ ప్రతిపక్ష పాత్రలో ఉండగా కూడ షర్మిల జగన్ కు అండగా నిలిచింది. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా షర్మిల వైసీపీకీ అలుపెరగని ప్రచారం చేసింది. ఏపీ వ్యాప్తంగా  రోజుల తరబడి ప్రచారంలో పాల్గొని షర్మిల వైసీపీ విజయానికి కృషి చేసింది. ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 151 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించింది.


వైసీపీ అధికారంలో వచ్చేంత వరకూ షర్మిల జగన్ కు అండగా నిలుస్తూ వచ్చింది. కానీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మాత్రం ఎక్కడో తేడా కొట్టింది. జగన్ కు షర్మిలకు మధ్య ఎక్కడో గ్యాప్ వచ్చింది. అది చాలా సందర్భాల్లోనే బయటపడింది. కొద్ది రోజులు షర్మిల జగన్ కు దూరంగా ఉంటూ వచ్చింది అదే సమయంలో షర్మిల రాజకీయంగా కూడా పూర్తిగా సైడ్ అయ్యారనే ప్రచారం జరిగింది. జగన్ కు షర్మిలకు మధ్య గ్యాప్ రావడానికి కారణాలపై  రకరకాల చర్చలు ప్రచారంలో ఉన్నాయి. ఐతే వాటిలో ఒకటి మాత్రం తెగ ప్రచారంలో ఉంది.  జగన్ సీఎం్ అయ్యాక తన ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయిందనే భావనలో షర్మిల ఉండేదట. కనీసం జగన్ ను కలవాలన్నా  నానా ఇబ్బందులు పడిందని షర్మిల సన్నిహితులు చెబుతున్నారు. అన్నింటికి మించి కడప ఎంపీ స్థానంపై షర్మిల ఎన్నో ఆశలు పెట్టుకుందట.ఐతే అప్పటికే జగన్ అవినాశ్ రెడ్డికి దానిపై మాట ఇవ్వడంతో షర్మిలకు నిరాశే మిగిలింది.


దీనికి తోడు జగన్ అధికారంలోకి వచ్చాక కుటుంబ సభ్యలను ఎవరినీ కూడా పాలనా వ్యవహారాల్లో తలదూర్చకుండా జాగ్రత్తపడ్డారు. మరోవైపు ఇదే సమయంలో జగన్ రాజకీయంగా బిజీ కావడంతో బిజినెస్ వ్యవహారాలను, కుటుంబ వ్యవహారాలను భారతి చూడడం మొదలు పెట్టింది. దీంతో షర్మిల తీవ్ర అసంతృప్తికి గురైంది. ఒక వైపు అధికారంలోకి వచ్చాక తనకు పదవి దక్కకపోవడం ఒక కారణం ఐతే ఇటు బిజినెస్, కుటుంబ వ్యవహారాల్లో కూడా తనకు తగినంత ప్రాధాన్యత దక్కడం లేదని షర్మిల తెగ ఫీలయిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇదే విషయంలో పలు మార్లు విజయమ్మతో జగన్ దృష్టికి తీసుకువచ్చినా సమయంలో కూడా జగన్ ఏదో ఒకటి చేద్దాంలే అని విజయమ్మకు చెప్పినట్లు లోటస్ పాండ్ వర్గాల చెప్పాయి.


ఐతే జగన్ సీఎం కావడంతో షర్మిల వ్యవహారంలో పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇది షర్మిలను మరింత ఆగ్రహానికి గురి చేసేలా చేసింది. తాను అన్న కోసం ఇంత చేస్తే కనీసం తనని పట్టించుకోలేదని తన తల్లి వద్ద షర్మిల పదే పదే ప్రస్తావించేదట. చాలా సందర్భాల్లో విజయమ్మ నీది నా బాధ్యత కాస్తా ఓపిక పట్టు అంటూ షర్మిలకు చెబుతూ వచ్చింది. ఇలా చాలా రోజులు గడిచిన తర్వాత కూడా జగన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇక అన్నతో తాడో పేడో తేల్చుకోవాలని షర్మిల డిసైడ్ అయ్యింది. ఇప్పటి వరకు షర్మిల వేసిన రాజకీయ అడుగులను బట్టి జగన్ మీద షర్మిలకు ఏమేర ఆగ్రహంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జగన్ తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఒకటైతే  జగన్ కు వ్యతిరేకంగా పనిచేసే వారితో కలవడం షురూ చేసింది.


ఐతే తనకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణ జగన్ భార్య భారతి అని షర్మిలకు ఒక అనుమానం. భారతి వల్లే జగన్ తనన దూరం పెట్టాడనేది షర్మిల మనోగతం. ఇటు రాజకీయాల్లోను, ఆర్థిక వ్యవహారాల్లోనే తనకు ప్రాధాన్యత తగ్గడానికి పూర్తిగా భారతియే కారణమని షర్మిల అనుకుంటున్నట్లు షర్మిల అంతరంగికులు చెబుతున్నారు. భారతి మాటలు పట్టుకునే తన అన్న జగన్ మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నాడని షర్మిల ఆగ్రహంగా ఉంది. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇక జగన్ నీడన ఉంటే తనకు ఎప్పటికైనా గుర్తింపు ఉండదు. తన దారి తను చూసుకోవాలని షర్మిల డిసైడ్ అయ్యింది అందుకే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగిన షర్మిల కాంగ్రెస్ లో చేరింది. కాంగ్రెస్ లో చేరి జగన్ తో ఇక యుద్దమే అన్నట్లుగా ఒక మెసేజ్ పాస్ చేసింది. అంతే కాదు వైఎస్ కుటుంబానికిఇ, జగన్ కు బద్దశత్రువులుగా ఉన్న వాళ్లతో సత్సంబంధాలు కూడా కొనసాగించడం మొదలుపెట్టింది. మొన్నటి ఎన్నికల్లో కూడా ఏకంగా జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసి పోటీలో కూడా నిలిచింది. దీంతో జగన్ కు కొంత మేర నష్టాన్ని షర్మిల కలిగించిందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.


ఇదే క్రమంలో తాజాగా వచ్చిన ఆస్తుల వివాదం కూడా అందులోనిదే అని వైఎస్ సన్నిహితులు చెబతున్నారు . ఏది ఏమైనా ఇక జగన్ తో తాడో పేడో తేల్చుకోవాల్సిందే అని షర్మిల డిసైడ్ అయ్యిందంట. భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఎలా ఉన్నా సరే తాను ఫేస్ చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తన సన్నిహితుల వద్ద షర్మిల చెబుతుందట. మరోవైపు జగన్ మాత్రం షర్మిల విషయంలో కాస్తా ఆచితూచి వ్యవహరించాలని అనుకుంటున్నారట. మొత్తానిక ఇప్పుడు జగన్ ఇటు తల్లి విజయమ్మ, అటు చెల్లెలు షర్మిల ఇంకోవైపు భార్య భారతి ఇలా ముగ్గురి మధ్యలో నలిగిపోతున్నారట. ఒక వైపు అధికార పార్టీ నుంచి ఎదరువుతున్న రాజకీయ సవాళ్లతో ఒక వైపు , కుటుంబ సభ్యుల తగాదాలు మరోవైపు జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని తాడేపల్లి వర్గాల టాక్. 


Also Read: Secretariat: సోషల్‌ మీడియాలో లైక్‌లు, పోస్టులు, కామెంట్లు చేయొద్దు.. పోలీసులకు ప్రభుత్వం వార్నింగ్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook