YS Sharmila: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ముంబై హీరోయిన్‌ కాదంబరి జైత్వాల్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్న వేళ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 'జగన్‌ ఇంత నీచానికి ఒడిగడుతారా?' అని విస్మయం వ్యక్తం చేశారు. ఆమెను వేధించడం దారుణంగా పేర్కొన్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chandrababu 3rd Day: పాములు, తేళ్లతో జీవిస్తున్న వరద బాధితులపై సీఎం చంద్రబాబు భావోద్వేగం


 


కడపలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో వైఎస్‌ షర్మిల పలు అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో ముంబై హీరోయిన్‌ కాదంబరి జైత్వాల్‌ వ్యవహారంపై కూడా స్పందించారు. 'ముంబై నటి కాదంబరి జైత్వాల్‌ను ఎలా కట్టడి చేయాలో సజ్జన్ జిందాల్, జగన్ ప్లాన్ చేశారు. ఇంత నీచానికి ఒడిగట్టడం దుర్మార్గం. ఒక మహిళను అడ్డుకోవడానికి ఎన్నో ప్లాన్ వేయడం దారుణం' అని తెలిపారు.

Also Read: Pawan Kalyan: పత్తా లేని పవన్‌ కల్యాణ్‌.. ఏపీ ఆపదలో ఉంటే సంబరాల్లో డిప్యూటీ సీఎం?


'వైద్యురాలైన కాదంబరి జైత్వాల్‌ను మానసికంగా వేదనకు గురిచేశారు. సినీ పరిశ్రమలోకి వచ్చి ఎదగాలని భావించిన మహిళను మానసికంగా వేధించారు. కేసు పెట్టాలని చూసిన ఆమెను తొక్కి పడేశారు. కాదంబరి జైత్వాల్ సామాన్యురాలైతే రూ.వంద కోట్లు ఇచ్చి నొక్కి పెట్టేసేవారు. కానీ ఉన్నతమైన కుటుంబం కావడంతో ఇక్కడకు తీసుకొచ్చి అరెస్ట్‌ చేయడం దుర్మార్గం. నాటి సీఎం జగన్‌కు తెలియకుండానే అప్పటి ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు వ్యవహరిస్తారా? ఇద్దరు కుమార్తెలు ఉన్న జగన్ జైత్వాల్‌కు జరిగిన అన్యాయంపై ఎందుకు ఆలోచించలేదు' అని షర్మిల నిలదీశారు.

*సజ్జన్‌ జిందాల్‌, జగన్‌ మధ్య సాన్నిహిత్యాన్ని గొప్పగా చెప్పుకున్నారు. జిందాల్‌కు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి ఎందుకు కట్టబెట్టారో మాజీ సీఎం జగన్‌ సమాధానం చెప్పాలి' అని కోరారు. ఈ వ్యవహారంపై జగన్‌ సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాదంబరి జైత్వాల్‌కు అండగా ఉండి పోరాటం చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter