CM YS Jagan Mohan Vs YS Sharmila: జగన్ అన్న వదిలిన బాణం అంటూ గతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్ షర్మిల.. ఇప్పుడు అన్న ఓటమే లక్ష్యంగా తన విమర్శల బాణాలను వదులుతున్నారు. ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీఎం జగన్‌ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ నేతలు ఆమెకు కౌంటర్ ఇస్తూ.. కాంగ్రెస్, టీడీపీ చేతిలో కీలుబొమ్మలా మారిపోయారంటూ ఫైర్ అవుతున్నారు. ఇక రీసెంట్‌గా సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించగా.. గతంలో ప్రకటించిన నవరత్నాలను అప్‌గ్రేడ్ చేస్తూ.. నిధులను పెంచారు. ఈ మేనిఫెస్టోపై కూడా షర్మిల తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Alluri Seetharamaraju@50Years: 50 యేళ్ల అల్లూరి సీతారామరాజు.. తెర వెనక ఆసక్తికర కథ ఇదే..


తాజాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆమె బహిరంగ లేఖ రాశారు. "ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారూ మీరు ఘనంగా చెప్పుకునే నవరత్నాలతోనే రాష్ట్రమంతా సుభిక్షమైపోయినట్లు, సమస్యలు అన్ని పరిష్కారమైనట్లు, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నట్లు గొప్పగా ప్రచారం చేసుకుటున్నారు. కానీ అదంతా ఒట్టి హంబక్. మీ ఐదేళ్ల పాలనలో నిత్య వైఫల్యాలతో ప్రతి రంగంలో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.." అని ఆమె లేఖలో పేర్కొన్నారు. తన న్యాయ నవ సందేహాలకు సమాధానాలు`చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.


1) ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన విషయం వాస్తవం కాదా..?


2) సాగు భూమి నిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు..?


3) 28 పథకాలను అర్ధంతరంగా ఎందుకు ఆపివేశారు..?


4) ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయింది..?


5) ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం పెట్టిన విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు..?


6) దళిత, గిరిజన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈ సారి ఎందుకు సీట్లు నిరాకరించారు..?


7) ఎస్సీ, ఎస్టీలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయి.. ఇది మీ వివక్ష కాదా..?


8) దళిత డ్రైవర్‌ను చంపి.. సూట్ కేసులో డోర్ డెలివరి చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్శిస్తున్నారు..?


9) స్టడీ సర్కిల్స్‌కి నిధులు ఇవ్వకుండా వాటిని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు..? అంటూ వైఎస్ షర్మిల 9 ప్రశ్నలతో సీఎం జగన్‌కు లేఖ రాశారు. సరైన సమాధానాలు, సమగ్ర వివరాలతో ఈ న్యాయ నవ సందేహాలను తీర్చిన తరువాతనే రాష్ట్రంలోని ఎస్సీలు, ఎస్టీల ఓట్లు అడగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. అంతవరకు ఎస్సీ, ఎస్టీ ఓట్లు అడిగే నైతిక హక్కులేదన్నారు. 


Also Read: Kadiyam Kavya - Manda krishna Madiga: కడియం కావ్య ఎస్సీ కాదు.. మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter