Avinash Reddy Arrest: వైఎస్ వివేకా హత్య కేసులో వరుసగా మూడవసారి వివిధ కారణాలతో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు గైర్హాజరయ్యారు. ఎప్పటికప్పుడు విచారణ వాయిదా కోరుతూ వచ్చారు. ఇవాళ మరోసారి లేఖ రాసినా పట్టించుకోకుండా సీబీఐ అధికారులు కర్నూలు చేరుకున్నారు. ఏ క్షణంలోనైనా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైఎస్ వివేకా హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. కర్నూలు విశ్వభారతి ఆసుపత్రికి సీబీఐ అధికారులు చేరుకోవడంతో టెన్షన్ నెలకొంది. మరోవైపు సీబీఐ వర్సెస్ అవినాష్ రెడ్డి మధ్య లేఖలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ నెల 16, 19న జరగాల్సిన విచారణకు హాజరుకాలేనంటూ లేఖ ద్వారా సమాచారమిచ్చి గైర్హాజరయ్యారు. ఇప్పుుడు తాజాగా మరోసారి విచారణకు అప్పుడే హాజరుకానని లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖపై సమాచారమివ్వని సీబీఐ బృందం పెద్దఎత్తున కర్నూలు విశ్వభారతి ఆసుపత్రికి చేరుకోవడంతో సర్వత్రా టెన్షన్ వాతావరణం నెలకొంది.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. తల్లి ఆరోగ్యం దృష్ట్యా విచారణకు హాజరుకాలేనని అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐకు లేఖ రాశారు. మరోవైపు ఈ లేఖను బదులివ్వకుండా సీబీఐ అధికారులు కర్నూలు విశ్వభారతి ఆసుపత్రికి చేరుకున్నారు. ఇదే ఆసుపత్రిలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి చికిత్స అందుతోంది. తల్లి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాతే విచారణకు హాజరౌతానని సీబీఐకు సమాచారమందించారు అవినాష్ రెడ్డి. 


ఇక అరెస్టు తప్పదా


ఇప్పటి వరకూ అవినాష్ రెడ్డి లేఖలకు స్పందిస్తూ సమయమిచ్చిన సీబీఐ అధికారులు ఈసారి గడువు ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. ఇవాళ అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయమనే వార్తలు వస్తున్నాయి. అవినాష్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ కూడా సీబీఐ సిద్ధం చేసింది. ఇవాళ ఉదయమే కర్నూలు చేరుకున్న సీబీఐ అధికారులు..జిల్లా ఎస్పీకు కూడా సమాచారమిచ్చారు. ఈ సంగతి తెలియగానే అవినాష్ రెడ్డి అనుచరులు, సన్నిహితులు భారీగా కర్నూలు ఆసుపత్రికి చేరుకున్నారు. స్థానిక పోలీసులు అవినాష్ రెడ్డి అనుచరుల్ని చెల్లాచెదురు చేస్తున్నారు. 


వరుసగా మూడవసారి విచారణకు హాజరుకాకపోవడంతో ఈసారి అదుపులో తీసుకునే అవకాశాలు స్పష్టం కన్పిస్తున్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్న విశ్వభారతి ఆసుపత్రికి చేరుకున్న సీబీఐ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాలకై ఎదురుచూస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాల్ని ఎప్పటికప్పుడు ఢిల్లీకు సమాచారం అందిస్తూ తగిన చర్యలకు సిద్ధమౌతున్నారు. మొత్తానికి అవినాష్ రెడ్డి అరెస్టు ఇవాళ తప్పదనే సమాచారం రావడంతో అంతా టెన్షన్ నెలకొంది. ఆసుపత్రి పరిసరాల్లో భారీగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. కొత్తవారికి దరిదాపుల్లో రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. 


Also read: AP Weather Updates: రేపు ఈ మండలాల్లో వడగాల్పులు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook