కడప: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసులో కీలకంగా మారిన వాచ్‌మెన్‌ రంగయ్యకు నార్కో అనాలిసిస్ పరీక్షలు చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. నార్కో పరీక్షల కోసం రంగయ్యను హైదరాబాద్‌కు తరలించారు. రెండు రోజుల నుంచి రంగయ్యను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నప్పటికీ.. అతడు సరైన సమాధానం చెప్పలేదని భావిస్తున్న అధికారులు కోర్టు అనుమతితో అతడిని నార్కో పరీక్షలకు తరలించారని తెలుస్తోంది. 


ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి తన సొంత నివాసంలోనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.