Viveka Murder Case: వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదా, రేపటి విచారణ కీలకం
Viveka Murder Case: వివేకా హత్యకేసులో రేపు అత్యంత కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ రేపు అరెస్టు చేయవచ్చనే సమాచారం వైరల్ అవుతోంది. రేపు మరోసారి సీబీఐ విచారణకు హాజరు కానుండటంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేయడం ఆందోళన రేపుతోంది. ఈసారి అరెస్టు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ ముమ్మరం చేస్తోంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని మరోసారి విచారించనుంది. ఇప్పటికే ఈ విషయంపై పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులు నోటీసులు అందించారు. మార్చ్ 6వ తేదీ అంటే రేపు విచారణకు హాజరు కావాలని సూచించారు. అయితే ఈ నోటీసులపై స్పందించిన అవినాష్ రెడ్డి..మార్చ్ 6వ తేదీన కుదరదని మరోసారి వస్తానని చెప్పినా ఫలితం లేకపోయింది. రేపు కచ్చితంగా రావల్సిందేననని స్పష్టం చేసింది.
రేపు జరిగే విచారణ కీలకమా
వివేకా హత్యకేసులో రేపు జరగనున్న అవినాష్ రెడ్డి విచారణ అత్యంత కీలకం కానుంది. ఇప్పటికే రెండుసార్లు సీబీఐ అవినాష్ రెడ్డిని విచారించింది. కీలకమైన విషయాలపై ప్రశ్నించింది. హత్య జరిగిన సమయంలో అవినాష్ రెడ్డి ఫోన్ లొకేషన్ ఘటనా స్థలంలో చూపించినట్టుగా గూగుల్ టేకౌట్ సహాయంతో సీబీఐ గుర్తించింది. అంటే హత్య జరిగిన సమయంలో ఆయన అక్కడెందుకున్నారు, హత్యలో పాత్ర ఉందా అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
ఇప్పటికే ఈ కేసు విషయమై అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సైతం సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు మూడోసారి విచారణకు నోటీసులు జారీ చేయడంతో పాటు తప్పనిసరిగా హాజరు కావాలని పట్టుబట్టడం, కోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో అవినాష్ రెడ్డి నిందితుడనేందుకు ప్రాధమిక ఆధారాలున్నాయని చెప్పడం వంటి పరిణామాలు ఈసారి అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదనే సంకేతాలిస్తున్నాయి.
Also read: Global Investors Summit 2023: విశాఖ సదస్సులో జగన్ , అంబానీల మధ్య సాన్నిహిత్యంపై సర్వత్రా చర్చ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook