Viveka Murder Case: వైఎస్ వివేకా హత్యకేసు విషయమై కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ సంచలనం రేపుతోంది. సీబీఐ విచారణను రికార్డు చేయాలని కోరుతూనే..కేసుకు సంబంధించి కీలక విషయాలు బయటపెట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సరిగ్గా లేదని..పారదర్శకంగా జరగడం లేదని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. సీబీఐ విచారణను న్యాయవాది సమక్షంలో ఆడియా, వీడియో రికార్డు చేసేలా ఆదేశించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు అవినాష్ రెడ్డి. మరోవైపు ఈ కేసు విషయమై తనకున్న కొన్ని అనుమానాల్ని పిటీషన్ ద్వారా కోర్టుకు తెలిపారు


అవినాష్ రెడ్డి వెల్లడించిన విషయాలివే..


వైఎస్ వివేకానందరెడ్డి 2010లో షేక్ షమీమ్‌ను రెండవ వివాహం చేసుకున్నారు. 2015లో ఓ కుమారుడు పుట్టాడు. అప్పట్నించి వివేకా కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. వివేకా రెండవ భార్య షమీమ్‌ను..వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, భావ శివ ప్రకాష్ రెడ్డిలు శత్రువుగా చూసేవారు. ఆదరించేవారు కారు. పలు కంపెనీల్లో సునీత, రాజశేఖర్ రెడ్డితో పాటు వివేకానందరెడ్డి కూడా డైరెక్టర్లు. కుటుంబంలో విభేధాలతో వివేకా చెక్ పవర్‌ను కూతురు, అల్లుడు రద్దు చేశారు. దాంతో వివేకానందరెడ్డి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 


వివేకా మొదటి భార్య, కూతురు హైదరాబాద్‌లో ఉంటుంటే..వివేకా మాత్రం ఎక్కువగా పులివెందులలోనే గడిపేవారు. ఓ దశలో షమీమ్ కుమారుడినే వారసుడిగా ప్రకటిస్తారనే ఊహాగానాలు సైతం వెలువడ్డాయి. ఓ విల్లు కూడా రాసినట్టు పుకార్లు వ్యాపించాయి. వివేకా హత్యానంతరం ఏ1 నుంచి ఏ4 వరకూ నిందితుల ఇళ్లలో ఈ పత్రాల కోసం వెతికినట్టు తెలుస్తోంది. సొంత కుటుంబసభ్యులే ఈ పనికి పాల్పడి ఉంటారని అర్ధమౌతోంది. ఆయనను వదిలించుకునేందుకే హత్య చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన హత్యానంతరం దర్యాప్తులో షమీమ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సునీత కుటుంబసభ్యులు బెదిరించారన్నారు. 


వివేకా హత్యకేసులో ఈ రెండవకోణం ఇప్పుడు సంచలనం కల్గిస్తోంది. వివేకా రెండవ వివాహం విషయం పులివెందులలో అందరికీ తెలిసిందే అయినా..బయటి ప్రపంచానికి అధికారికంగా వెల్లడి కావడం ఇదే. 


Also read: Viveka Murder Case: వివేకా హత్య కేసులో మరో పరిణామం, తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటీషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook