YS Jagan: ఆ మహిళలకు రూ.5 వేలు సాయం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలోనే నడుస్తున్నారు. పలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తండ్రి బాటలోనే నడుస్తున్నారు. పలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా (YSR Arogya Asara) పథకం కింద ప్రసవం అయిన మహిళలకు తక్షణ సాయంగా రూ.5 వేవల చొప్పున సాయం అందించనున్నట్లు వెల్లడించారు. Andhra Pradesh: భారీగా తెలంగాణ మద్యం స్వాధీనం
అంగన్‌వాడీలలో నాడు-నేడు, ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’, ఇతర పథకాల నిర్వహణపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. గర్భవతులు, బాలింతలు, మూడేళ్ల లోపు వయసున్న శిశువులను ఒక విధంగా.. 36 నెలల నుంచి ఆరేళ్ల వరకు చిన్నారులను మరో విధంగా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీలలో నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. IPL 2020: ఐపీఎల్ ప్రారంభం ఎప్పుడో తెలుసా?
అంగన్‌వాడీలలో చిన్నారులకు పుస్తకాలు సకాలంలో అందించాలని, లెర్నింగ్ స్కిల్స్ పెంపొందించేందుకు తగిన వస్తువులు, పరికరాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతున్నాయని చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. జబర్దస్త్ యాంకర్ Anasuya లేటెస్ట్ ఫొటోలు
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్